Begin typing your search above and press return to search.

నిర్మాత కుమారుడితో బ్యూటీ స్నేహం!

By:  Tupaki Desk   |   11 March 2020 2:40 PM IST
నిర్మాత కుమారుడితో బ్యూటీ స్నేహం!
X
ఆ భామ మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించింది. తెలుగులో కూడా వరసగా హిట్లు సాధించి హ్యాట్రిక్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. టాప్ హీరోల సినిమాల్లో అవకాశాలు రాలేదు కానీ మీడియమ్ రేంజ్ హీరోలతో చాలా సినిమాల్లో నటించింది. అయితే కొన్ని వరస ఫ్లాపులతో కెరీర్ కాస్త మందగించింది. ప్రస్తుతం మలయాళం సినిమాలలో ఎక్కువగా నటిస్తోంది.

ఇప్పటికే ఈ భామ ఒక క్రికెటర్ తో లవ్ ఎఫైర్ కొనగిస్తోందని టాక్ ఉంది. ఆ వార్తలను ఈ భామ ఖండించినప్పటికీ ఇప్పటికీ ముంబై మీడియాలో ఇద్దరి డేటింగ్ రిపోర్ట్స్ ఆగడం లేదు. ఇదిలా ఉంటే ఈ భామకు హీరోయిన్ గా ఓ కొత్త ఛాన్స్ వచ్చిందట. ఒక స్టార్ ప్రొడ్యూసర్ సోదరుడి కుమారుడి డెబ్యూ సినిమాలోనే ఈ ఆఫర్ దక్కిందట. ఈ కొత్త జంట ఫ్రెండ్ షిప్ వెండితెరపైనే కాదని నిజ జీవితంలో కూడా స్నేహం చేస్తున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి ఇది జస్ట్ స్నేహమేనా లేదా స్నేహానికి మించి ఇంకేదైనా ఉందా అనే విషయంపై మాత్రం పెద్దగా క్లారిటీ లేదు.

ఈ భామకు ఈ సినిమా తప్ప మరో ఆఫర్ లేదు. మరి ఈ సినిమాతో టాలీవుడ్ లో మరోసారి బిజీ అవుతుందా లేదా అనేది వేచి చూడాలి. అదేంటో కానీ ఈ అందమైన భామ ఫ్రెండ్ షిప్ లు ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతుంటాయి. ఈ స్నేహాల కంటే సినిమా విజయాలతో.. నటనతో చర్చనీయాంశం అయితే మేలు అని సెటైర్లు కూడా పడుతున్నాయి.