Begin typing your search above and press return to search.

గాయ‌కుడు అద్నాన్ సమీ తండ్రి అయిన నాటి ఆ క్ష‌ణం!‌

By:  Tupaki Desk   |   16 March 2021 1:30 PM GMT
గాయ‌కుడు అద్నాన్ సమీ తండ్రి అయిన నాటి ఆ క్ష‌ణం!‌
X
ప్ర‌ముఖ పాకిస్తానీ గాయ‌కుడు అద్నాన్ స‌మీ త‌న లైఫ్ ఉత్త‌మ క్ష‌ణాల్ని ఆస్వాధిస్తున్నారు. ఆయ‌న మూడేళ్ల క్రిత‌మే తండ్రిగా ప్ర‌మోటైన సంగ‌తి తెలిసిందే. ఇంత‌కుముందే భారతీయ పౌరుడిగా మారిన ఈ గాయకుడు మదీనా అనే ఆడపిల్లకి తండ్రి అయ్యారు. మే 10న‌ యాంజెల్ మ‌దీనా జన్మించింది. ఆ ఆనంద‌క‌ర క్ష‌ణం అద్నాన్ ఎంతో భావోద్వేగానికి లోన‌య్యారు. అయితే ఇప్ప‌టికి మెదీనా మూడేళ్ల చిన్నారి.

తాజాగా మెదీనా ప‌సికందుగా ఉన్న‌ప్పుడు త‌న మొద‌టి స్ప‌ర్శ‌కు సంబంధించిన ఓ అరుదైన ఫోటోని అద్నాన్ సోష‌ల్ మీడియాల్లో షేర్ చేయ‌గా అది అభిమానుల్లో వైర‌ల్ అయ్యింది. అద్నాన్ కుమార్తె పూర్తి పేరు `మదీనా సామి ఖాన్`.

అద్నాన్ ఆఫ్ఘన్ అనే చిత్రంలో నటించే క్ర‌మంలో త‌న లుక్ మొత్తం మార్చుకున్న సంగ‌తి తెలిసిందే. ఊబ‌కాయం నుంచి బ‌య‌ట‌ప‌డి ఇప్పుడు ఇస్మార్ట్ గా క‌నిపిస్తున్నారు అద్నాన్. ఆ మేకోవ‌ర్ ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న ఎంద‌రికో స్ఫూర్తి అన‌డంలో సందేహ‌మేం లేదు.