Begin typing your search above and press return to search.

సామి అందాల కూతురు ఇదిగో

By:  Tupaki Desk   |   14 July 2017 1:29 PM GMT
సామి అందాల కూతురు ఇదిగో
X
అద్నాన్ సామితో టాలీవుడ్ కి బోలెడంత రిలేషన్ ఉంది. దాదాపు టాప్ స్టార్స్ అందరికీ తన గొంతు అరువిచ్చాడు. తెలుగులో ఈయన పాడిన పాటలు అన్నీ ఛార్ట్ బస్టర్స్ గా నిలిచాయంటే.. ఇప్పటికే వినిపించేస్తూ ఉంటాయంటే.. అద్నాన్ ట్యాలెంట్ అర్ధమవుతుంది. సింగర్ గానే కాకుండా.. మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా ఈయన బాగా ఫేమస్. 20 రకాల ఇన్ స్ట్రుమెంట్స్ ను ప్లే చేయగల ఘనాపాటి అద్నాన్ సామి.

ఈ 45 ఏళ్ల సింగర్ కం కంపోజర్.. అప్పట్లో 'ఏ జిల్లా ఏ జిల్లా' అంటూ మెగాస్టార్ నుంచి మొదలు పెట్టి.. రీసెంట్ గా టెంపర్ లో 'చూలేంగే ఆస్మా' వరకూ చాలానే పాటలు పాడాడు. అయితే ఈ సింగర్ పర్సనల్ లైఫ్ అంత సాఫీగా ఉండదు. మూడు పెళ్లిళ్లు చేసుకున్న అద్నాన్ సామి.. 2010నుంచి తన మూడో భార్య రోయా ఫర్బయితో జీవితం సాగిస్తున్నాడు. రీసెంట్ గా వీరికి ఓ కూతురు జన్మించింది. మే నెలలో పుట్టిన ఈ చిన్నారిని.. ఇప్పటివరకూ పరిచయం చేయని అద్నాన్ సామి.. ఇప్పుడు తన కూతురిని అందరికీ చూపించాడు.

తమ కూతురుకు మెదినా సామి ఖాన్ అని పేరు పెట్టుకున్న అద్నాన్.. తను పాదాలపై.. అమ్మ బుగ్గలపై ముద్దులు ఇస్తున్న ముద్దులొలికే ఫోటోను అందరికీ షేర్ చేశాడు అద్నాన్ సామి. తన చిన్నారికి అందరి ఆశీర్వాందం కావాలని.. భగవంతుడి దీవెనలు ఉండాలని కోరుతూ పెట్టిన ట్వీట్ అందరినీ ఆకట్టుకుంటోంది.