Begin typing your search above and press return to search.

ముంబై మీడియాకు అడివి శేష్ టెర్రిఫిక్ రిప్లే

By:  Tupaki Desk   |   19 May 2022 5:30 PM GMT
ముంబై మీడియాకు అడివి శేష్ టెర్రిఫిక్ రిప్లే
X
యంగ్ హీరో అడివి శేష్ హీరోగా, రైట‌ర్‌గా త‌న‌దైన పంథాలో దూసుకుపోతున్నాడు. విభిన్న‌మైన చిత్రాల్ని ఎంచుకుంటూ హీరోగా త‌న‌రంటూ ప్ర‌త్యేక‌త‌ని చాటుకుంటున్నాడు. అద్భుత‌మైన స్క్రిప్ట్ ల‌ని ఎంచుకుంటూ స్టార్ హీరోల‌నే వాటికి ప్రొడ్యూస‌ర్స్ గా ఎంచుకుంటూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీ అవుతున్నారు. అడివి శేష్ తాజాగా న‌టించిన చిత్రం 'మేజ‌ర్‌'. 2008 ముంబై తాజ్ హోట‌ల్ అటాక్ నేప‌థ్యంలో రియ‌ల్ హీరో మేజ‌ర్ సందీప్ ఉన్నికృష్ణ‌న్ వీరోచితంగా పోరాడి అమ‌రుడ‌య్యారు. అయ‌న లైఫ్ స్టోరీ ఆధారంగా ఈ మూవీని రూపొందించారు.

స‌యీ మంజ్రేక‌ర్‌, శోభితా ధూళిపాల హీరోయిన్ లుగా కీల‌క పాత్ర‌ల్లో న‌టించిన ఈ మూవీకి శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌కుడిగా వ్య‌వ‌హ‌రించారు. అనురాగ్ రెడ్డి, శ‌ర‌త్ చంద్ర‌, సోనీ పిక్చ‌ర్స్ ఇంట‌ర్నేష‌న‌ల్ ప్రొడ‌క్ష‌న్స్ తో క‌లిసి సూప‌ర్ స్టార్ మ‌హేష్ ఈ మూవీని నిర్మించారు.

ఇప్ప‌టికే దేశ వ్యాప్తంగా భారీ అంచ‌నాల్ని సొంతం చేసుకున్న ఈ మూవీని తెలుగు, హిందీతో పాటు మ‌ల‌యాళంలోనూ ఏక కాలంలో జూన్ 3న విడుద‌ల చేస్తున్నారు. ఈ సంద‌ర్భంగా మేక‌ర్స్ అండ్ టీమ్ సినిమా ప్ర‌మోష‌న్స్ ని ప్రారంభించేసింది.

ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల్ని పెంచేస్తుంటే చిత్ర బృందం ఈ మూవీ ప్ర‌చారాన్ని ముంబైలో మొద‌లు పెట్టింది. ఈ మూవీతో పాన్ ఇండియా స్థాయి ఇమేజ్‌ని క్రేజ్ ని అడివి శేష్ సొంతం చేసుకోబోతున్నారు. ఈ నేప‌థ్యంలో ఈ మూవీపై మంజి బ‌జ్ క్రియేట్ అయింది. ఈ నేప‌థ్యంలో మేజ‌ర్ ప్ర‌మోష‌న్స్ కోసం ముంబై వెళ్లిన అడివి శేష్ అక్క‌డి మీడియాతో ప్ర‌త్యేకంగా ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేశారు. ఇందులో అడివి శేష్‌, హీరోయిన్ స‌యీ మంజ్రేక‌ర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా అడివి శేష్‌ని ముంబై మీడియా ఇరుకున పెట్టే ప్ర‌శ్న వేసింది. 'అడివి శేష్ మీ సినిమా మేజ‌ర్ జూన్ 3న విడుద‌ల కాబోతోంది. ఇదే స‌మ‌యంలో రెండు పెద్ద చిత్రాలు కూడా విడుద‌ల కాబోతున్నాయి. క‌మ‌ల్ హాస‌న్, ఫాహ‌ద్ ఫాజిల్‌, విజ‌య్ సేతుప‌తి న‌టించిన 'విక్ర‌మ్‌', అక్ష‌య్ కుమార్ న‌టించిన 'పృథ్వీరాజ్ విడుద‌ల‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ముక్కోణ పోటీ ఉండే అవ‌కాశం వుంది క‌దా? దీని గురించి మీరు ఏమ‌నుకుంటున్నారు? అని ప్ర‌శ్నించారు.

ఈ ప్ర‌శ్న‌కు అడివి శేష్ ఇచ్చిన టెర్రిఫిక్ రిప్లే ఇప్ప‌డు నెట్టింట హాట్ టాపిక్ గా మారి వైర‌ల్ అవుతోంది. 'ప్రాక్టిక‌ల్ గా చెప్పాలంటే తెలుగు నుంచి వ‌స్తున్న భారీ సినిమా మాది. 'విక్ర‌మ్‌' త‌మిళం నుంచి వ‌స్తున్న భారీ సినిమా. అలాగే బాలీవుడ్ నుంచి వ‌స్తున్న భారీ మూవీ 'పృథ్వీరాజ్‌'. కానీ పెద్ద చాప‌ల మ‌ధ్య వ‌స్తున్న బంగారు చాప మాది' అని శేష్ ఇచ్చిన స‌మాధానం బాలీవుడ్ మీడియాని సైతం ఆక‌ట్టుకుని వారి మ‌న‌సుల్ని గెలు,ఉకోవ‌డం విశేషం.