Begin typing your search above and press return to search.

ఇంతకీ ఎలాంటి గూఢచారి బాస్‌?

By:  Tupaki Desk   |   5 Nov 2016 6:30 AM GMT
ఇంతకీ ఎలాంటి గూఢచారి బాస్‌?
X
క్షణం మూవీ హీరో అడివి శేష్ కి ఇప్పుడు క్రేజ్ బాగానే ఉంది. బాహుబలిలో భల్లాలదేవుడి కొడుకుగా నటించడం.. ఆ తర్వాత క్షణం అందరినీ ఆకట్టుకోవడంతో.. హీరో ఆఫర్లు వరుసగా వస్తున్నాయి. ప్రస్తుతం గూఢచారి అనే మూవీలో నటిస్తున్నాడు అడివి శేష్. ఈ మూవీలో అండర్ కవర్ ఏజంట్ గా ఓ భయంకరమైన టెర్రరిస్ట్ ను పట్టుకోవడానికి.. దేశ విదేశాలు తిరిగేస్తాడీ హీరో.

సాధారణంగా ఇన్వెస్టిగేషన్ అనగా.. సీబీఐ.. ఇంటెలిజెన్స్ బ్యూరో.. రా(రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్) అనే అనుకుంటాం. మన సినిమాల్లో కేరక్టర్లు అలాగే ఉంటాయి. కానీ అడివి శేష్ మాత్రం కొత్త టైపు గూఢచారిని అంటున్నాడు. 'నేను రా ఏజంట్ గా కానీ.. ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గా కానీ కనిపించను. రా ఏజంట్ కేవలం విదేశాల్లో పరిశోధిస్తాడు. ఐబీ ఇండియాలో ఆపరేషన్స్ మాత్రమే నిర్వహిస్తుంది. కానీ నేను మాత్రం దేశంలోను.. విదేశంలోను ఇన్వెస్టిగేషన్ చేస్తా' అంటున్నాడు అడివి శేష్.

నిజానికి ఇలా ప్రపంచం అంతా ఇన్వెస్టిగేట్ చేసేందుకు 'డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఇన్ కం టాక్స్ ఇన్వెస్టిగేషన్'.. 'డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్' డిపార్ట్ మెంట్లకు అధికారం ఉంటుంది. మరి టెర్రరిస్ట్ ని పట్టుకోవడం అంటున్నాడు కాబట్టి.. ఏదో కొత్త టైపు గూఢచారిగా కనిపించబోతున్నానని చెబుతున్నాడు. ఒకవేళ ఏకంగా ఎఫ్ బీఐ.. ఇంటర్ పోల్.. అంటూ ఏకంగా పెద్ద పెద్ద పేర్లు చెప్పేసి భయపెట్టేస్తాడేమో అనే డౌట్ కూడా ఉంది. ఈ వెరైటీ స్పై థ్రిల్లర్ లో అడివి శేష్ కి జోడీగా.. మిస్ ఇండియా శోభిత ధూళిపాళ నటిస్తోంది.



Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/