Begin typing your search above and press return to search.

ఈ హీరో ఆ రెండూ ముట్ట‌ను అంటున్నాడే!

By:  Tupaki Desk   |   27 July 2022 2:30 AM GMT
ఈ హీరో ఆ రెండూ ముట్ట‌ను అంటున్నాడే!
X
ఇండ‌స్ట్రీలో ఎంత ఒదిగి వుంటే అంత ఎదురుగుతామంటారు. కాంట్ర‌వ‌ర్సీల‌కు వెళ్ల‌కుఏండా పాజిటివ్ గా వుంటూ త‌మ ప‌ని తాము చేసుకుంటూ పోయే వాళ్ల‌కే ఇక్క‌డ మ‌నుగ‌డ‌. ఈ విష‌యాన్ని అతి త‌క్కువ స‌మ‌యంలోనే ఒంట బ‌ట్టించుకున్నాడ‌ట యంగ్ అండ్ టాలెంటెడ్ యంగ్ హీరో అడివి శేష్‌. `క‌ర్మ‌` సినిమాతో ద‌ర్శ‌కుడిగా, హీరోగా ఎంట్రీ ఇచ్చి షాకిచ్చిన ఈ మ‌ల్టీటాలెంటెడ్ స్టార్ ఇప్ప‌టికీ అదే పంథాని అనుస‌రిస్తూ రైట‌ర్‌గా, హీరోగా మ‌రింత‌గా రాణిస్తున్నాడు.

అతి త‌క్కువ బ‌డ్జెట్ లో అద్భుతాలు సృష్టిస్తూ మేకింగ్ లో వండ‌ర్స్ ని క్రియేట్ చేస్తున్నాడు. `గూఢ‌చారి` చిత్రంతో మేకింగ్ ప‌రంగా ఎంత త‌క్కువ బ‌డ్జెట్ తో అద్భుతాలు చేయొచ్చో నిరూపించి ఇండ‌స్ట్రీ వ‌ర్గాల‌ని షాక్ కు గురిచేశాడు. ఆ త‌రువాత పంజా, బ‌లుపు, ర‌న్ రాజా ర‌న్‌, బాహుబ‌లి ది బిగినింగ్‌, దొంగాట‌, సైజ్ జీరో, ఊపిరి వంటి చిత్రాల్లో న‌టిస్తూనే సోలో హీరోగానూ వండ‌ర్స్ క్రియేట్ చేస్తున్నాడు. త‌న‌దైన మార్కు మేకింగ్ తో, రైటింగ్ స్కిల్స్ తో స్టార్ హీరోలు ఫిదా అయ్యేలా చేస్తున్నాడు.

అడివి శేష్ వ‌ర్క్ కు ఫిదా అయినా నేచుర‌ల్ స్టార్ నాని ..శేష్ తో ప్ర‌స్తుతం `హిట్ 2` ని నిర్మిస్తున్న విష‌యం తెలిసిందే. ఇక సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు త‌న‌తో ప్ర‌తిష్టాత్మ‌కంగా `మేజ‌ర్‌` మూవీని నిర్మించారు. రీసెంట్ గా పాన్ ఇండియా వైడ్ గా విడుద‌లైన ఈ మూవీ దేశ వ్యాప్తంగా సంచ‌ల‌న విజ‌యాన్ని సొంతం చేసుకుంది. నెట్ ఫ్లిక్స్ లో విడుద‌లైన ఈ మూవీ అక్క‌డ కూడా దుమ్ముదులుపుతోంది.

ప్ర‌స్తుతం శైలేష్ కొల‌ను డైరెక్ష‌న్ లో `హిట్ 2 : ద సెకండ్ కేస్‌`లో న‌టిస్తున్నాడు. ఈ మూవీ త్వ‌ర‌లో థియేట‌ర్ల‌లోకి రాబోతోంది. ఈ నేప‌థ్యంలో అడివి శేష్ తాజాగా ఓ సీక్రెట్ ని బ‌య‌ట‌పెట్టాడు. మేజ‌ర్ స‌క్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న అడివి శేష్ తాను ఇంత వ‌ర‌కు కాంట్ర‌వ‌ర్సీల‌లో చిక్కుకోక‌పోవ‌డానికి గ‌త సీక్రెట్ ని బ‌య‌ట‌పెట్టాడు.

`నేను మందు తాగ‌ను, స్మోకింగ్ చేయ‌ను` అని అస‌లు విష‌యం బ‌య‌ట‌పెట్టాడు. మందుకు దూరంగా వుంటాను కాబ‌ట్టే తాను కాంట్ర‌వ‌ర్సీల‌కు దూరంగా వుంటున్నాన‌ని స్ప‌ష్టం చేశాడు.

ఇక మందు, స్మోకింగ్ ల‌తో పాటు నాన్ వెజ్ కూడా తినే అలవాటు త‌న‌కు లేద‌ని చెప్పేశాడు. అంతే కాకుండా ఏప‌ని లేక‌పోతే ఎవ‌రిని డిస్ట్రబ్ చేయ‌డంట‌.. కామ్ గా నిద్ర‌లోకి జారుకుంటాడ‌ట‌. ఇక పెళ్లి గురించి మాట్లాడుతూ ` తాను ఇప్పుడు పెళ్లి గురించి ఆలోచించ‌డం లేద‌ని, కానీ త‌న పేరెంట్స్ మాత్రం పెళ్లి చేయాల‌నే ఆలోచ‌న‌లో వున్నారని స్ప‌ష్టం చేశాడు.