Begin typing your search above and press return to search.

2020లో గూఢ‌చారి సీక్వెల్ - శేష్

By:  Tupaki Desk   |   28 April 2019 7:46 AM GMT
2020లో గూఢ‌చారి సీక్వెల్ - శేష్
X
క్ష‌ణం.. గూఢ‌చారి చిత్రాల‌తో బంప‌ర్ హిట్లు కొట్టాడు అడ‌వి శేష్. ఆ త‌ర్వాత `2 స్టేట్స్` తెలుగు రీమేక్ ని ప్రారంభించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఈ సినిమా చిత్రీక‌ర‌ణ కొన్ని సాంకేతిక కార‌ణాల‌తో ఆగిపోయింద‌ని ఇటీవ‌ల ప్ర‌చార‌మైంది. అయితే శేష్ మాత్రం వ‌రుసగా ఇత‌ర‌ ప్రాజెక్టుల‌తో బిజీ అయిపోయారు. ప్ర‌స్తుతం `గూఢ‌చారి` సీక్వెల్ స్క్రిప్ట్ రెడీ చేసే ప‌నిలో ఉన్నారు. ఈ సినిమాని సూప‌ర్ స్టార్ మ‌హేష్ సొంత బ్యాన‌ర్ లో నిర్మిస్తార‌ని ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. అలాగే మ‌రో రెండు సినిమాల‌కు సంబంధించిన క‌థా చ‌ర్చ‌లు స‌హా ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల్లో బిజీగా ఉన్నార‌ని తెలుస్తోంది.

అడివి శేష్ `తుపాకి`తో మాట్లాడుతూ తాజా క‌మిట్ మెంట్ల వివ‌రాల్ని రివీల్ చేశారు. ప్ర‌స్తుతం ఓ మూడు సినిమాల‌కు సంబంధించిన ప‌నులు సాగుతున్నాయి. ఇందులో ప్ర‌స్తుతం అగ్ర నిర్మాత పీవీపీతో సినిమాకి సంబంధించిన ప‌నులు వేగంగా పూర్త‌వుతున్నాయి. ఈ ఏడాది ఈ ప్ర‌తిష్ఠాత్మ‌క చిత్రం సెట్స్ పైకి వెళుతోంది. ఇందులో అందాల రాక్ష‌సి ఫేం న‌వీన్ చంద్ర ఒక హీరోగా న‌టిస్తున్నారు అని తెలిపారు.

దీంతో పాటే మ‌రో రెండు ప్రాజెక్టుల గురించి చెబుతూ `మేజ‌ర్` చిత్రంతో పాటు `గూఢ‌చారి 2` లోనూ న‌టించ‌నున్నాన‌ని తెలిపారు. `గూఢ‌చారి` ( శ‌శికిర‌ణ్ తిక్క ద‌ర్శ‌కుడు) బ్లాక్ బ‌స్ట‌ర్ ఫ్రాంఛైజీలో గూఢ‌చారి 2 ఎప్పుడు సెట్స్ కెళుతుంది? అన్న ప్ర‌శ్న‌కు 2020లో ఆ సినిమాని పూర్తి చేసి రిలీజ్ చేస్తామ‌ని వెల్ల‌డించారు. `గూఢ‌చారి 2` చిత్రాన్ని మ‌హేష్ ఎంబీ ప్రొడ‌క్ష‌న్స్ లో నిర్మిస్తారా? అన్న‌దానిపై పూర్తి స్ప‌ష్ఠ‌త రావాల్సి ఉంది.

ఇక `మేజ‌ర్` ప్రాజెక్టుకు సంబంధించిన ప్రీలుక్ ని ఇదివ‌ర‌కూ శేష్ సామాజిక మాధ్య‌మాల్లో రివీల్ చేసిన సంగ‌తి తెలిసిందే. 26/11 ముంబై దాడుల్లో చ‌నిపోయిన మేజ‌ర్ సందీప్ ఉన్నిక్రిష్ణ‌న్ జీవిత‌కథ ఆధారంగా ఈ సినిమా చేస్తున్నాన‌ని తెలిపారు. ఈ చిత్రానికి మేజ‌ర్ అనే టైటిల్ క‌న్ఫామ్ అయ్యింది. ముంబై టెర్ర‌ర్‌ నుంచి ఎంద‌రో ప్ర‌జ‌ల ప్రాణాల్ని కాపాడిన రియ‌ల్ లైఫ్‌ హీరో క‌థ ఇది. ఇది నా డ్రీమ్ ప్రాజెక్ట్. ఈ సినిమాని సూప‌ర్ స్టార్ మ‌హేష్ నిర్మిస్తున్నారు. అందుకు సంబంధించిన సంప్ర‌దింపులు జ‌రిపాను.. అని తెలిపారు. ఈ సినిమాని సోనిపిక్చ‌ర్స్ ఇండియా నిర్మిస్తుండ‌డంతో అంత‌ర్జాతీయ స్థాయి వ‌చ్చింద‌ని ట్విట్ట‌ర్ లో ఆనందం వ్య‌క్తం చేశారు. తాజాగా నాని జెర్సీ సినిమాని వీక్షించిన అడివి శేష్ ``స్ట‌న్నింగ్ .. ఇంక మాట‌ల్లేవ్‌!`` థియేటర్ లో నా క‌న్నీళ్ల‌ను దాచుకోలేక‌పోయాన‌ని ట్వీట్ చేయ‌డం ఆస‌క్తిక‌రం.