Begin typing your search above and press return to search.

'హృదయమా' షూట్ లో శేష్-సయీల లవ్లీ మూమెంట్స్..!

By:  Tupaki Desk   |   12 Jan 2022 12:43 PM IST
హృదయమా షూట్ లో శేష్-సయీల లవ్లీ మూమెంట్స్..!
X
26/11 ముంబై ఉగ్రవాద దాడులలో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ స్ఫూర్తిదాయకమైన జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం ''మేజర్''. వర్సటైల్ హీరో అడివి శేష్ టైటిల్ రోల్ పోషించిన ఈ సినిమాలో సయీ మంజ్రేకర్ - శోభితా ధూళిపాళ - ప్రకాష్ రాజ్ - రేవతి - మురళీ శర్మ కీలక పాత్రల్లో నటించారు.

'మేజర్' చిత్రాన్ని తెలుగుతో పాటుగా హిందీ మలయాళ భాషల్లో రూపొందిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన స్పెషల్ పోస్టర్స్ - టీజర్ మంచి స్పందన తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో ఇటీవల వచ్చిన 'హృదయమా' అనే ఫస్ట్ సింగిల్ ప్రేక్షకులను విశేషంగా అలరిస్తోంది. హీరోహీరోయిన్ల మధ్య బ్యూటిఫుల్ లవ్ స్టొరీని ఈ పాటలో చూడొచ్చు.

మేజర్ సరిహద్దులో విధులు నిర్వర్తిస్తుండగా.. ప్రేయసి అతని కోసం ఎదురు చూడటం.. ఇద్దరూ ప్రేమలేఖల ద్వారా ఒకరి భావాలను మరొకరు పంచుకోవడం 'హృదయమా' పాటలో కనిపిస్తుంది. తాజాగా మేకర్స్ ఈ సాంగ్ షూట్ లో క్యాండీడ్ అండ్ క్యూట్ మూమెంట్స్ ని షేర్ చేశారు. అడివి శేష్ - సయీ ఇద్దరూ చిత్రీకరణను బాగా ఎంజాయ్ చేసినట్లు తెలుస్తోంది.ల్

ఇకపోతే '#హృదయమా' అనే హ్యాష్ ట్యాగ్ ని ఉపయోగించి రీల్స్ రూపంలో తమ మనోహరమైన క్షణాలను షేర్ చేయమని మేకర్స్ పేర్కొన్నారు. శ్రీచరణ్ పాకాల ఈ పాటకు అద్భుతమైన స్వరాలు సమకూర్చారు. కృష్ణకాంత్ సాహిత్యం అందించగా.. యువ గాయకుడు సిద్ శ్రీరామ్ తన వాయిస్ తో మరోసారి మెస్మరైజ్ చేసారు. వంశీ పచ్చిపులుసు అందంగా తన కెమెరాలో బంధించారు.

''మేజర్'' సినిమాకి శశి కిరణ్ తిక్కా దర్శకత్వం వహిస్తున్నారు. అడవి శేష్ కథ - స్క్రీన్ ప్లే సమకూర్చగా.. అబ్బూరి రవి సంభాషణలు అందించారు. మహేష్ బాబు GMB ఎంటర్టైన్మెంట్ మరియు A+S మూవీస్ సహకారంతో సోనీ పిక్చర్స్ ఫిల్మ్స్ ఇండియా ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. 2022 ఫిబ్రవరి 11న ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.