Begin typing your search above and press return to search.

అడివిశేష్ మేజ‌ర్ అప్ డేట్ ఇచ్చేశాడు

By:  Tupaki Desk   |   4 May 2022 6:08 AM GMT
అడివిశేష్ మేజ‌ర్ అప్ డేట్ ఇచ్చేశాడు
X
విభిన్న‌మైన మూవీస్ ని ఎంచుకుంటూ హీరోగా బ్యాక్ టు బ్యాక్ విజ‌యాల్ని సొంతం చేసుకుంటున్నారు యంగ్ హీరో అడివి శేష్‌. క‌థ‌బ‌లమున్న సినిమాల‌తో పాటు ఆస‌క్తిని రేకెత్తించే సంఘ‌ట‌న‌ల ఆధ‌రంగా రూపొందుతున్న చిత్రాల్లోనూ న‌టిస్తూ టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలుస్తున్నారు. అడివి శేష్ న‌టిస్తున్న తాజా చిత్రం `మేజ‌ర్‌`. ముంబై దాడుల నేప‌థ్యంలో అత్యంత భారీ స్థాయిలో తెర‌కెక్కిన చిత్ర‌మిది. మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ ధైర్య సాహ‌సాల‌కు ప్ర‌తీక‌గా నిలిచిన ఈ చిత్రాన్ని ఆయ‌న బ‌యోపిక్ గా రూపొందిస్తున్నారు. సోనీ పిక్చ‌ర్స్ ఇంటర్నేష‌న‌ల్ తో క‌లిసి సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు ఈ మూవీని నిర్మించారు.

`గూడ‌చారి` ఫేమ్ శ‌శి కిర‌ణ్ తిక్క ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీస్ స‌యీ మంజ్రేక‌ర్‌, శోభితా దూలిపాళ‌, ప్ర‌కాష్ రాజ్, రేవ‌తి, ముర‌ళీశ‌ర్మ కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. 2008లో ముంబైలోని తాజ్ మ‌హ‌ల్ ప్యాలెస్ హోట‌ల్ పై జ‌రిగిన ఉగ్ర‌దాడి ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నం సృష్టించింది. అదే ఉదంతం నేప‌థ్యంలో `మేజ‌ర్‌` చిత్రాన్ని రూపొందించారు. అడివి శేష్ చిత్రాల్లోనే అత్యంత భారీ బ‌డ్జెట్ తో రూపొందిన ఈ చిత్రం గ‌త కొంత కాలంగా రిలీజ్ వాయిదా ప‌డుతూ వ‌స్తోంది.

ఇప్ప‌టికే ఫ‌స్ట్ గ్లింప్స్ తో సినిమాపై అంచ‌నాల్ని పెంచేసింది చిత్ర బృందం. మేజ‌ర్ ఉన్నికృష్ణ‌న్ పాత్ర‌లో అడివి శేష్ మేజ‌ర్ గా క‌నిపించిన స‌న్నివేశాలు, బ్లాస్టింగ్స్ ఓ రేంజ్ లో సినిమా హాలీవుడ్ యాక్ష‌న్ చిత్రాల‌ని గుర్తు చేసేలా వుందంటూ ప్రేక్ష‌కులు కామెంట్ చేయ‌డంతో సినిమా కు మ‌రింత హైప్ క్రియేట్ అయింది. దీంతో ఇటీవ‌ల వ‌రుస వాయిదాలు ప‌డుతున్న ఈ మూవీ రిలీజ్ ని మేక‌ర్స్ ఫైన‌ల్ చేశారు. జూన్ 3న వ‌ర‌ల్డ్ వైడ్ గా తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ మూవీని రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టుగా చిత్ర బృందం ప్ర‌క‌టించింది.

సినిమా రిలీజ్ మ‌రో నెల రోజులు వుండ‌టంతో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ యాక్టివిటీస్ ని ప్రారంభించేసింది. ఈ నేప‌థ్యంలో తాజాగా ఓ వీడియోని విడుద‌ల చేస్తూ చిత్ర బృందం ట్రైల‌ర్ రిలీజ్ డేట్ కు సంబంధించిన అప్ డేట్‌ ని ఇచ్చేసింది. ఈ మూవీని తెలుగు, హిందీ భాష‌ల్లో సైమ‌ల్ టెనియ‌స్ గా షూట్ చేశామ‌ని తెలియ‌జేస్తూ ఓ వీడియోని విడుద‌ల చేసిన మేక‌ర్స్ ట్రైల‌ర్ ని మే 9న విడుద‌ల చేస్తున్నామ‌ని, ఇండియ‌న్ రియ‌ల్ హీరో స్టోరీని సెల‌బ్రేట్ చేసుకోవ‌డానికి రెడీగా వుండండి అంటూ ప్ర‌క‌టించింది.

టీజ‌ర్ లోనే ఇర‌గ‌దీసిన మేజ‌ర్ టీమ్ ట్రైల‌ర్ లో ఇంకా ఏరేంజ్ లో విధ్వంసం సృష్టించారో అని ఆడియ‌న్స్ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. అడివి శేష్ కెరీర్ కి మైల్ స్టోన్ గా నిల‌వ‌నున్న ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో సంచ‌ల‌నాలు సృష్టించ‌డం ఖాయంగా క‌నిపిస్తోంది. ఈ చిత్రానికి క‌థ అడివి శేష్‌, మాట‌లు అబ్బూరి ర‌వి, అక్ష‌త్ అజ‌య్ శ‌ర్మ (హిందీ), సినిమాటోగ్ర‌ఫీ వంశీ ప‌చ్చిపులుసు.