Begin typing your search above and press return to search.

ట్రెండీ టాక్: HIT సీక్వెల్ విశ్వ‌క్ చేజారిందా?

By:  Tupaki Desk   |   30 Nov 2020 7:00 AM IST
ట్రెండీ టాక్: HIT సీక్వెల్ విశ్వ‌క్ చేజారిందా?
X
నైజాం నుంచి అనూహ్యంగా దూసుకొచ్చిన యంగ్ ట్యాలెంట్ విశ్వక్ సేన్. తెలంగాణ యాస భాష‌తో విజ‌య్ దేవ‌ర‌కొండ త‌ర్వాత విశ్వక్ స్క్రీన్ ప్రెజెన్స్ కి ప్ర‌శంస‌లు ద‌క్కాయి. ఫ‌ల‌క్ నుమా దాస్ .. హిట్ వంటి చిత్రాల్లో న‌టించిన అత‌డికి కెరీర్ ప‌రంగా ఛాన్సుల‌కు కొద‌వేమీ లేదు.

అయితే `హిట్` సీక్వెల్ లో విశ్వ‌క్ న‌టించ‌డం లేద‌ని.. చిత్ర‌ నిర్మాత నాని వేరొక హీరోని ఎంపిక చేసుకున్నార‌ని ప్ర‌చార‌మ‌వుతోంది. ఇంత‌కీ ఎవ‌రా హీరో అంటే? విశ్వ‌క్ ని రీప్లేస్ చేస్తూ హిట్ మూవీలో గూఢ‌చారి ఫేం అడివి శేష్ న‌టిస్తార‌ని.. ప్ర‌స్తుతం చ‌ర్చ‌లు సాగుతున్నాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

ఈ మూవీ కోసం ఇప్ప‌టికే దర్శకుడు సైలేష్ స్క్రిప్టు రెడీ చేశార‌ని తెలుస్తోంది. సీక్వెల్లో శేష్ తప్ప మరెవరూ కథానాయకుడిగా నటించరన్న ప్ర‌చారం నిజ‌మా కాదా? అన్న‌ది ద‌ర్శ‌క‌నిర్మాత‌లే ధృవీక‌రించాల్సి ఉంటుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక స‌మాచారం లేదు. ప్ర‌స్తుతానికి ఊహాగానాలు మాత్ర‌మే. విశ్వ‌క్ పాండిచ్చేరిలో వేరొక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ప్రస్తుతానికి కొన్ని మంచి ప్రాజెక్టుల్లో విశ్వ‌క్ న‌టిస్తున్నారు.