Begin typing your search above and press return to search.

`హిట్ 2` స‌రే `గూఢ‌చారి 2` ఎప్పుడో?

By:  Tupaki Desk   |   13 Jan 2022 10:25 AM GMT
`హిట్ 2` స‌రే `గూఢ‌చారి 2` ఎప్పుడో?
X
నేచుర‌ల్ స్టార్ నాని ఓ వైపు హీరోగా బిజీగా ఉన్నా నిర్మాత‌గా స‌త్తా చాటేందుకు తెలివైన ప్ర‌ణాళిక‌ల‌తో దూసుకెళుతున్నాడు. ప్ర‌యోగాత్మ‌క కంటెంట్ ని ఎంపిక చేసుకుని నేటి జ‌న‌రేష‌న్ హీరోల‌తో స‌క్సెస్ అందుకుంటున్నారు. నిర్మాత‌గా త‌న‌కంటూ ఒక రేంజుంద‌ని నిరూపిస్తున్నాడు. ఇంత‌కుముందు `ఆ!` సినిమాతో త‌న‌లోని వైవిధ్య‌మైన ఆలోచ‌న‌ల‌ను నిరూపించాడు నాని.

ఇటీవ‌లే విశ్వ‌క్ సేన్ తో హిట్ లాంటి హిట్ చిత్రం తీసాడు. అనంత‌రం హిట్ 2ని అడివి శేష్ తో ప్రకటించారు. ఈ ఫ్రాంచైజీ మొదటి భాగం బాక్సాఫీస్ వద్ద బాగా ఆడటంతో సీక్వెల్ పైనా ఆస‌క్తి నెల‌కొంది. మహమ్మారి కారణంగా చిత్రీకరణ ఆల‌స్య‌మైంది. అడివి శేష్ దాదాపు 60 శాతం షూటింగ్ పూర్తయిందని పేర్కొంటూ హిట్ 2 గురించి తాజాగా స‌మాచారం అందించ‌డం తో క్లారిటీ వ‌చ్చింది.

అంతేకాదు.. ఇది సీక్వెల్ లేదా ప్రీక్వెల్ కాదని.. ఒక‌ కొత్త భిన్నమైన కథతో తెర‌కెక్కుతోంద‌ని పేర్కొన్నారు. అడివి శేష్ ఆంధ్రప్రదేశ్ కి చెందిన‌ కృష్ణ దేవ్ అనే పోలీసుగా ఇందులో న‌టిస్తున్నారు. ఈ చిత్రాన్ని తెలుగులోనే కాకుండా మలయాళంలో కూడా అనువ‌దిస్తున్నామ‌ని వెల్ల‌డించారు. హైదరాబాద్ లో మొదటి భాగం చిత్రీక‌ర‌ణ‌తో పాటు.. వైజాగ్- గోవాలో ఇత‌ర భాగం చిత్రీక‌ర‌ణ పూర్త‌వుతుంది. సినిమాలో కొన్ని డార్క్ ఎలిమెంట్స్ ఉన్నాయి. వాటిని చూడాలంటే ఆగాల్సిందేని తెలిపారు. అడివి శేష్ మేజర్ తో పాన్-ఇండియా రేంజులో స‌త్తా చాటాల‌ని ఉవ్విళ్లూరుతున్నాడు. త‌దుప‌రి గూఢ‌చారి 2ని కూడా తెర‌కెక్కిస్తారు. అటు బాలీవుడ్ లోనూ ఆఫ‌ర్లు వ‌చ్చాయ‌ని తెలిసింది. `హిట్ 2` స‌రే `గూఢ‌చారి 2` ఎప్పుడో? అన్న‌ది కూడా శేష్ మ‌రో సంద‌ర్భంలో పూర్తి క్లారిటీనిస్తారేమో చూడాలి. మేజ‌ర్ రిలీజ్ తేదీపైనా మ‌రింత స్ప‌ష్ఠ‌త కావాలి.