Begin typing your search above and press return to search.

మైన‌స్ డిగ్రీల చ‌లిలో గూఢ‌చారి

By:  Tupaki Desk   |   1 March 2018 4:52 AM GMT
మైన‌స్ డిగ్రీల చ‌లిలో గూఢ‌చారి
X
హీరోగా... ద‌ర్శ‌కుడిగా... స్ర్కీన్ ప్లే రైట‌ర్‌గా... ఎన్నో పాత్ర‌లు పోషిస్తున్నాడు అడివి శేష్‌. స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ సినిమాలు చేయ‌డం అత‌నికి ఆస‌క్తి. గ‌తంలో చేసిన క‌ర్మ‌, దొంగాట‌, క్ష‌ణం చిత్రాలు అవే చెబుతున్నాయి. ఇప్పుడు మ‌రో స‌స్పెన్స్ థ్రిల్ల‌ర్ చేసే ప‌నిలో బిజీగా ఉన్నాడు అడివి శేష్‌. అందుకోసం మైన‌స్ డిగ్రీల చ‌లిలో షూటింగ్ చేస్తున్నాడు.

అడివి శేష్ హీరోగా తెర‌కెక్కుతున్న సినిమా గూఢ‌చారి. ఈ సినిమా ద్వారా ద‌ర్శ‌కుడిగా శ‌శికిర‌ణ్ టిక్కా ప‌రిచ‌యం అవుతున్నాడు. ఈ చిత్ర‌యూనిట్ ప్ర‌స్తుతం అమెరికాలోని నార్ట్ వెస్ట్... మౌంట్ రెయినియ‌ర్‌...లీవెన్ వ‌ర్త్‌...కాస్కేడ్ మౌంటెన్స్‌... త‌దిత‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుతోంది. అక్క‌డ మైన‌స్ డిగ్రీలలో చ‌లి న‌మోదవుతోంది. ఆ చ‌లిలో కూడా చిత్ర‌యూనిట్ క‌ష్ట‌ప‌డుతోంది. గ‌డ్డ‌క‌ట్టే చ‌లిలో త‌మ క‌ష్టాల‌ను చెప్పేందుకు ఫోటోలు తీసి సోష‌ల్ మాధ్య‌మాల్లో పోస్టు చేస్తోంది చిత్ర‌యూనిట్‌.

ఈ సినిమా అభిషేక్ పిక్చ‌ర్స్ వారు నిర్మిస్తున్నారు. 2013లో మిస్ ఇండియాగా గెలిచిన శోభితా ధూళిపాల ఈ సినిమా ద్వారా తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అవుతోంది. ఈమె తెనాలి పిల్లే. ఈ సినిమాను ఈ వేస‌విలో విడుద‌ల చేసేందుకు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సిద్ధ‌మ‌వుతున్నారు. ఇదొక యాక్ష‌న్ స్పై థ్రిల్ల‌ర్ సినిమా.