Begin typing your search above and press return to search.

మహేశ్ మూవీ కోసం ఆ హీరో గంటన్నర జర్నీ చేసి మరీ వెళ్లి సినిమా చూశాడట

By:  Tupaki Desk   |   2 Dec 2022 3:00 AM GMT
మహేశ్ మూవీ కోసం ఆ హీరో గంటన్నర జర్నీ చేసి మరీ వెళ్లి సినిమా చూశాడట
X
అందరికి అభిమాన నటీనటులు ఉంటారు. తాము అభిమానించి.. ఆరాధించిన వారితోనే కలిసి పని చేయటం.. వారికి సన్నిహితులు కావటం అందరికి సాధ్యం కాదు. కోట్లల్లో ఒకరికిమాత్రమే సాధ్యమవుతుంది. సినిమాటిక్ గా అనిపించినా ఇది నిజం.

బాలీవుడ్ సూపర్ హీరోయిన్ కత్రినా కైఫ్ కు ఉన్న కోట్లాది మంది అభిమానుల్లో ఒకరు.. సాదాసీదా స్థాయి నుంచి సినీ హీరోగా మారటం.. చివరకు తాను ఎంతో ఇష్టపడే కత్రినాను పెళ్లి చేసుకోవటం ఎలానో.. ఒక హీరోగా వెలుగుతున్న ఒక నటుడు.. తాను ఎంతో అభిమానించే నటుడు నిర్మాతగా వ్యవహరించిన మూవీలో పని చేయటం సమ్ థింగ్ స్పెషల్ గా చెప్పక తప్పదు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు.. అడవి శేష్.

దర్శకుడిగా.. నటుడిగా.. ఇలా సినిమాకు సంబంధించి మల్టీ టాలెంట్ ఉన్న అతగాడు హీరోగా నటించిన మూవీ 'హిట్ ద 2 కేస్' ఈ రోజు (శుక్రవారం) విడుదల కానుంది. ఈ నేపథ్యంలో అడవి శేష్ కొన్ని మీడియా సంస్థలతో ప్రత్యేకంగా మాట్లాడారు.

ఈ సందర్భంగా అతగాడి మాటల్ని విన్నప్పుడు కాసింత సినిమా టిక్ గా అనిపించినా.. అవన్నీ నిజాలే కావటం చదివే వారికి ఎక్సైటింగ్ గా అనిపించక మానదు.

ఇంతకూ అతనేం చెప్పాడంటే.. తాను విదేశాల్లో ఉన్నప్పుడు.. మరారి సినిమా కోసం.. మహేశ్ బాబు సినిమాను మిస్ కాకూడదని ఏకంగా గంటన్నర పాటు జర్నీ చేసి మరీ సినిమాను చూసినట్లుగా చెప్పారు.అలా మహేశ్ మీద అభిమానంతో సినిమా చూసిన తాను.. ఆ తర్వాత ఆయన నిర్మాణ సంస్థలో మేజర్ సినిమాను చేయటాన్ని గుర్తు చేసుకున్నారు.

అలానే తానుఇష్టపడే మరో హీరో నాని అని.. ఇప్పుడు అతను నిర్మాతగా వ్యవహరిస్తున్న హిట్ మూవీలో తాను హీరోగా నటించటం తన లక్ అని చెప్పుకొచ్చారు. నాని లాంటి నటులు సౌత్ ఇండియాలో చాలా తక్కువగా ఉంటారని చెప్పుకొచ్చారు. ఏమైనా.. అడవి శేష్ లాంటి లక్కీ ఫెలోలు చాలా అరుదుగా ఉంటారని మాత్రం చెప్పక తప్పదు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.