Begin typing your search above and press return to search.

ఒరిజినల్ తో సంబంధం లేకుండా...

By:  Tupaki Desk   |   3 April 2018 4:43 AM GMT
ఒరిజినల్ తో సంబంధం లేకుండా...
X
టాలీవుడ్ లో ఈమధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్ లో వచ్చిన సినిమాల్లో ప్రేక్షకులను బాగా మెప్పించిన సినిమా క్షణం. అడవి శేష్ డైరెక్షన్ లో వచ్చిన ఈ మూవీ తక్కువ బడ్జెట్ లోనే తెరకెక్కి బ్రహ్మాండమైన వసూళ్లు రాబట్టింది. ఈ మూవీని తాజాగా బాలీవుడ్ లో బాఘీ-2 పేరుతో రీమేక్ చేశారు. టైగర్ ష్రాఫ్ - దిశాపఠాని హీరో హీరోయిన్లుగా నటించిన ఈ మూవీ చూసిన వారెవరైనా ఇది క్షణం మూవీ రీమేక్ అని చెబితే తప్ప నమ్మరు. సెంటిమెంట్ బేస్డ్ థ్రిల్లర్ మూవీ యాక్షన్ ప్యాక్ డ్ ఎంటర్ టెయినర్ గా మార్చేశారు.

హిందీలో బాఘీ-2 నిర్మించిన సాజిద్ నడియావాలా క్షణం రీమేక్ రైట్స్ కు ప్రత్యేకంగా డబ్బులేమీ ఇవ్వలేదు. దానికి బదులుగా అర్జున్ కపూర్ - ఆలియా భట్ జంటగా నటించిన 2 స్టేట్స్ తెలుగు రీమేక్ రైట్స్ ఇచ్చాడు. ఇప్పుడు రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్ గా అడవి శేష్ అదే టైటిల్ తో సినిమా చేస్తున్నాడు. 2 స్టేట్స్ రీమేక్ లో సాజిద్ నడియావాలా స్టయిల్ నే అడవి శేష్ ఫాలో అయిపోతున్నాడు. ఒరిజినల్ తో సంబంధం లేకుండా క్షణం రీమేక్ ఎలా మార్చేశారో 2 స్టేట్స్ లో కూడా మొత్తం ట్రీట్ మెంటే మార్చేస్తున్నారు. కాన్సెప్ట్ మాత్రం ఉంచి మిగతా అంతా కొత్తగా తీస్తున్నారు.

క్షణం సినిమా కథలో ట్విస్టులతో పాటు ఇన్ సైడ్ గా ఉండే సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ ఫీల్ లేకపోయే సరికే బాఘీ-2 బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది. 2 స్టేట్స్ లో రెండు పంజాబీ అబ్బాయి.. తమిళమ్మాయి ప్రేమకథ ఫ్రెష్ గా అనిపించి ప్రేక్షకులను మెప్పించింది. రీమేక్ లో దీనిని తెలుగు - బెంగాలీ ప్రేమకథగా మార్చేస్తున్నారు. అసలు స్టోరీలోని ఫీల్ పట్టించుకోకుండా రీమేక్ చేస్తే ఇక్కడా అదే రిజల్ట్ రిపీటయ్యే ప్రమాదం ఉంది. మరి అడవి శేష్ ఏం కేర్ తీసుకున్నాడో చూడాలి మరి.