Begin typing your search above and press return to search.

హిట్ 2 అంతకు మించి ఉంటుందట

By:  Tupaki Desk   |   4 Jun 2022 2:30 AM GMT
హిట్ 2 అంతకు మించి ఉంటుందట
X
విభిన్న చిత్రాలతో హీరోగా కంటే మంచి నటుడిగా పేరు దక్కించుకున్న అడవి శేష్‌ తాజాగా మేజర్‌ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రియల్‌ హీరో మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ పాత్రలో అడవి శేష్‌ కనిపించి మెప్పించాడు. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. అడవి శేష్‌ తదుపరి సినిమా గురించి అప్పుడే చర్చ మొదలు అయ్యింది. మేజర్ సినిమా ప్రమోషన్ సమయంలోనే తదుపరి సినిమా గురించిన విషయాలను శేష్‌ చెప్పుకొచ్చాడు.

నాని నిర్మాణంలో శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్‌ 2 సినిమాను అడవి శేష్‌ చేస్తున్నాడు. హిట్‌ 1 మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో హిట్‌ 2 పై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. హిట్ 1 లో విశ్వక్ సేన్ హీరోగా నటించగా హిట్ 2 లో అడవి శేష్‌ నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్‌ ప్రారంభం అయ్యి చాలా కాలం అయ్యింది. కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. మరో వైపు మేజర్‌ సినిమాను పూర్తి చేసే ఉద్దేశ్యంతో హిట్‌ 2 ను కాస్త పక్కకు పెట్టారు.

తాజాగా మేజర్‌ సినిమా విడుదల సందర్బంగా ఒక ఇంటర్వ్యూలో హిట్‌ 2 గురించి అడవి శేష్‌ మాట్లాడాడు. ఆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మొదటి హిట్ తో పోల్చితే రెండవ హిట్‌ అంతకు మించి అన్నట్లుగా ఉంటుందంటూ చెప్పుకొచ్చాడు. హిట్‌ 2 సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంటుందనే నమ్మకంతో అడవి శేష్‌ ఉన్నాడు.

హిట్‌ 1 పూర్తిగా ఒక కేసు కు సంబంధించిన కథ కాగా హిట్‌ 2 మరో కొత్త కేసుకు సంబంధించిన కథ తో నడుస్తుంది. మొదటి హిట్ కు ప్రస్తుతం రూపొందుతున్న హిట్‌ కు ఎలాంటి సంబంధం కథ విషయంలో ఉండదు. ఒక కేసు ఇన్వెస్టిగేషన్‌ కథతో హిట్‌ కథలు వస్తున్నాయి. ముందు ముందు మరిన్ని హిట్‌ సినిమాలు వస్తాయంటూ దర్శకుడు ఆమద్య చెప్పుకొచ్చాడు.

హిట్‌ సినిమా మాత్రమే కాకుండా గూఢచారి సినిమాను కూడా సీక్వెల్‌ చేసే ఉద్దేశ్యంతో అడవి శేష్‌ ఉన్నాడని సమాచారం. సినిమాల సంఖ్య ఇబ్బడి ముబ్బడిగా పెంచుకోవడం కంటే మంచి సినిమాలు కొన్ని చేయాలి అనేది ఈ హీరో అభిప్రాయం కావచ్చు.. అందుకే మెల్లగా సినిమాలను చేస్తూ ఉన్నాడు. రచయితగా కూడా మంచి పట్టున్న హీరో అవ్వడం వల్ల అడవి శేష్‌ కు మంచి స్క్రిప్ట్‌ లు దక్కుతున్నాయి. ఈ ఏడాదిలోనే హిట్‌ 2 తో శేష్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.