Begin typing your search above and press return to search.

జగన్ భేష్ అన్న టాలీవుడ్ హీరో

By:  Tupaki Desk   |   24 Aug 2021 5:16 AM GMT
జగన్ భేష్ అన్న టాలీవుడ్ హీరో
X
ఏపీలో సీఎం జగన్ ప్రభుత్వ పాలన బాగుందని టాలీవుడ్ యంగ్ సినీ హీరో అడవి శేష్ ప్రశంసలు కురిపించారు. జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘దిశ’ యాప్ మహిళా లోకానికి అద్భుతమైన రక్షణ అంటూ కొనియాడారు. దిశా యాప్ ఉంటే చాలు భద్రత మీ వెంటే అని అడవి శేష్ మెచ్చుకున్నారు.

విశాఖలో జరిగిన దిశ యాప్ మీద అవగాహన కార్యక్రమంలో హీరో అడవి శేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. మహిళల భద్రత విషయంలో వైసీపీ సర్కార్ తీసుకుంటున్న చర్యలు ప్రశంసనీయంగా ఉన్నాయని తెలిపారు.

దిశా యాప్ ద్వారా ఏపీ ప్రభుత్వం మహిళలకు ఎంతో రక్షణ ఇస్తున్నారని.. విద్యార్థినులు, మహిళకు, డౌన్ లోడ్ చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. అరచేతిలోనే అద్భుతమైన రక్షణను అందించిన ప్రభుత్వం ఇది అంటూ ప్రశంసించారు.

మహిళల రక్షణ కోసం ఇలాంటి టెక్నాలజీతో అద్భుతంగా ఇలా కార్యక్రమాలను నిర్వహించడం జగన్ దార్శనీయతకు నిదర్శనమని అడవి శేష్ కొనియాడారు. మొత్తానికి తాను తెర ముందు మాత్రమే హీరో కానని తెర వెనుక కూడా సామాజిక చైతన్యం కలిగించే బాధ్యత కలిగిన హీరోనని అడవి శేష్ చెప్పుకున్నారు.