Begin typing your search above and press return to search.

ఓకే బంగారం రీమేక్‌ లో బ్లాక్‌ బస్టర్ జంట

By:  Tupaki Desk   |   11 Oct 2015 1:30 AM GMT
ఓకే బంగారం రీమేక్‌ లో బ్లాక్‌ బస్టర్ జంట
X
మొన్న సమ్మర్లో తమిళ - తెలుగు ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న లవ్ స్టోరీ ‘ఓకే బంగారం’. వరుస ఫ్లాపుల్లో ఉన్న మణిరత్నం మళ్లీ ‘సఖి’ స్టయిల్లో సినిమా తీసి సక్సెస్ ట్రాక్ ఎక్కాడు. దుల్కర్ సల్మాన్ - నిత్యామీనన్ అద్భుతమైన పెర్ఫామెన్స్ తో మణి ఆలోచనలకు ప్రాణం పోశారు. ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ కాబోతున్నట్లు సమాచారం. ఇంతకుముందు తన సినిమాల్ని తనే బాలీవుడ్లో వేరే నటీనటులతో రీమేక్ చేసేవాడ మణి. ఐతే ‘రావణ్’ ఫ్లాపయ్యాక మళ్లీ అటు చూడలేదు. ‘ఓకే బంగారం’ హిందీ రీమేక్ కి మణిరత్నం శిష్యుడే దర్శకత్వం వహిస్తాడట. మణి దగ్గర చాలా ఏళ్లు అసిస్టెంటుగా పని చేసిన షాద్ అలీ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.

ఓకే బంగారం రీమేక్ లో ఆదిత్య రాయ్ కపూర్ - శ్రద్ధా కపూర్‌ జంటగా నటిస్తారన్న వార్తలు బాలీవుడ్ లో సంచలనం రేపుతున్నాయి. వీళ్లిద్దరూ ఇంతకుముందు జంటగా నటించిన ‘ఆషికి-2’ అప్పట్లో బ్లాక్ బస్టర్ హిట్టయింది. వాళ్లిద్దరికీ అదే తొలి సినిమా కూడా. ఐతే ఆ సినిమా తర్వాత ఇద్దరికీ విభేదాలు రావడంతో మళ్లీ జంటగా నటించే అవకాశం వచ్చినా ఒప్పుకోలేదు. ఐతే ఇప్పుడా విభేదాలన్నీ సమసిపోయాయి. మంచి సబ్జెక్టు వెతుక్కుంటూ రావడంతో మళ్లీ తమ మ్యాజిక్ రిపీట్ చేయడానికి రెడీ అవుతున్నారు ఆదిత్య - శ్రద్ధ - త్వరలోనే ఈ సినిమా సెట్స్ మీదికి వెళ్లనుంది.