Begin typing your search above and press return to search.

1000 కోట్లు.. బ‌డా నిర్మాణ సంస్థ మాస్ట‌ర్ ప్లాన్ వ‌ర్క‌వుట‌వుతుందా?

By:  Tupaki Desk   |   19 March 2022 12:30 PM GMT
1000 కోట్లు.. బ‌డా నిర్మాణ సంస్థ మాస్ట‌ర్ ప్లాన్ వ‌ర్క‌వుట‌వుతుందా?
X
య‌శ్ రాజ్ ఫిలింస్ ప‌రిచ‌యం అవ‌స‌రంలేదు. బాలీవుడ్ ని ద‌శాబ్ధాల పాటు శాసిస్తున్న అతి పెద్ద బ్యాన‌ర్ ఇది. ఆదిత్య చోప్రా అధినేత‌. YRF 50వ వార్షికోత్స‌వ‌ వేడుకలను రణవీర్ సింగ్ నటించిన జయేష్‌భాయ్ జోర్దార్ తో ప్రారంభించేందుకు స‌ద‌రు నిర్మాణ సంస్థ ప్ర‌ణాళిక‌ల్లో ఉంది. అభిమానులతో మళ్లీ కనెక్ట్ కావడానికి 20 ఈవెంట్ లను వరుసగా ప్లాన్ చేస్తుండ‌డం వేడి పెంచుతోంది.

ర‌ణ‌వీర్‌- జయేష్ భాయ్ జోర్దార్ తో అస‌లైన పండ‌గ‌ను య‌ష్ రాజ్ సంస్థ ప్రారంభిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను అలరించిన 50 అద్భుతమైన సంవత్సరాలను జరుపుకోవాలని స‌ద‌రు బ్యాన‌ర్ చూస్తోంది. ఒక మహమ్మారి రెండు సంవత్సరాల సుదీర్ఘ ప్రణాళికలకు ఫుల్ స్టాప్ పెట్టిన తర్వాత ఈ సంవత్సరం కంపెనీ అతిపెద్ద మైలురాయిని చేరుకున్న వేడుక‌ల్ని ఘ‌నంగా జరుపుకోవడానికి ఆదిత్య చోప్రా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు సినీ వ్యాపార వర్గాలు వెల్లడించాయి!

జయేష్‌భాయ్ జోర్దార్ అనేది ఒక భారీ ఎంటర్ టైనర్. రణవీర్ ఇందులో క‌థానాయ‌కుడు. జయేష్‌భాయ్ తో భారతీయ సినిమాలో అరుదైన హీరో .. హీరోయిజంపై స‌రికొత్త బ్రాండ్ ను వైఆర్ ఎఫ్‌ అందించనుందని ప్ర‌చార‌మ‌వుతోంది. మనీష్ శర్మ స‌హ‌నిర్మాత‌గా.. నూతన దర్శకుడు దివ్యాంగ్ ఠక్కర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ మోస్ట్ అవైటెడ్ జాబితాలో ఉంది. 13 మే 2022న ప్రపంచవ్యాప్తంగా మూవీ విడుదల కానుంది.

ఒక టాప్ ట్రేడ్ సోర్స్ వెల్లడిస్తూ.. “ఆదిత్య చోప్రా YRF సంస్థ‌ 50 సంవత్సరాల వేడుక‌లను పెద్ద ఎత్తున జరుపుకోవాలని కోరుకుంటున్నాడు. ఎందుకంటే అతను పరిశ్రమలో అతి భారీ చిత్రాల లైన‌ప్ ను కలిగి ఉన్నాడు. జయేష్ భాయ్ జోర్దార్ - పృథ్వీరాజ్ - షంషేరా- పఠాన్ - టైగర్ 3 స‌హా మరో రెండు ప్రకటించని చలనచిత్రాలు YRF 50 స్లేట్ కోసం రెడీగా ఉన్నాయి.

ఈ చిత్రాలలో ప్రతి ఒక్కటి సంస్థ కు గోల్డెన్ స్టోన్ గా నిల‌వ‌నున్నాయ‌ని టాక్. వీట‌న్నిటికీ అత్యంత ప్రత్యేకమైన వినూత్న రీతిలో ప్ర‌చారం చేయాల‌ని ప్రణాళికలు తయారు చేసారు. జయేష్ భాయ్ జోర్దార్ తో ఈ వేడుకలు ప్రారంభమవుతాయి. ఆదిత్య చోప్రా- మనీష్ శర్మ - రణ్ వీర్ - YRF లోని మొత్తం టీమ్ ప్రతి ఒక్కరి హృదయాలను తాకే .. సమాజానికి సినిమా వీక్షణ అనుభూతిని కలిగించే ఒక ప్రత్యేకమైన చిత్రం... అని వెల్ల‌డించారు.

ఉత్సవాలు పునఃప్రారంభించవలసి వస్తే అది విశ్వవ్యాప్త ప్రేమను పొందే ప్రాజెక్ట్ తో ప్రారంభించాల్సిన అవసరం ఉందని YRF స్పష్టం చేసింది. జయేష్ భాయ్ జోర్దార్ లో రణవీర్ సింగ్ ప్రజల హృదయాలను దోచేస్తాడని వారు విశ్వసిస్తున్నారు. ఈ ఆనందం ప్ర‌తిబింబించేలా YRF 50 సెల‌బ్రేష‌న్స్ ను కిక్ స్టార్ట్ చేయాలని వారు కోరుకుంటున్నారు.

కాబట్టి అభిమానుల్లో అస‌లు సిస‌లు సందడి అంతా ఇక‌పై ప్రారంభమవుతుంది. ఈ వేదిక‌పై 1000 కోట్లు (కొన్ని చిత్రాల‌కు క‌లిపి) పైగా పెట్టుబ‌డులు కుమ్మ‌రించిన సినిమాల విజువ‌ల్ గ్లింప్స్ ని అందించ‌నుంది. YRF వివిధ ప్లాన్ లను ఆవిష్కరిస్తుంది. దీని ద్వారా అభిమానులు తమ అభిమాన సూపర్ స్టార్ లతో ఏడాది పొడవునా పరస్పరం సంభాషించేలా చూస్తారని కూడా తెలుస్తోంది.

జయేష్ భాయ్ జోర్దార్ మార్కెటింగ్ ప్రచారంలో రణ్ వీర్ స్టార్-ఫ్యాన్ డైనమిక్ లను మార్చడానికి ప్ర‌య‌త్నిస్తున్నాడ‌ట‌. ఎందుకంటే అతను తనను ఎంతో ఆరాధించే అభిమానుల‌కు మునుపెన్నడూ లేని విధంగా యాక్సెస్ ఇస్తాడు. మహమ్మారి తర్వాత YRF ప్రజలను వారి అభిమాన సూపర్ స్టార్ లకు చేరువ చేయాలని వారి దగ్గరికి తీసుకురావాలని కోరుకుంటోంది.

YRF 50 వేడుకలు అంతే! ఫ్యాన్-స్టార్ రిలేషన్ షిప్ ఎల్లప్పుడూ సామీప్యంగా మారాల‌నేది ఆకాంక్ష‌. మహమ్మారి తర్వాత మన దేశంలోని అగ్రశ్రేణి తారలు ప్రజలను తిరిగి థియేటర్ లకు ర‌ప్పించేందుకు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ప్రజలు మళ్లీ హిందీ సినిమా స‌క్సెస్ వేడుక‌ల్ని జ‌రుపుకోవాల‌నేది కోరిక‌. YRF50 వేడుకలు ఆ వాగ్దానాన్ని చాలా వరకు నెర‌వేర్చ‌నున్నాయ‌ని టాక్ వినిపిస్తోంది.