Begin typing your search above and press return to search.

#సుశాంత్..భ‌న్సాలీ త‌ర్వాత మ‌రో బిగ్ షాట్ విచార‌ణ‌!

By:  Tupaki Desk   |   19 July 2020 6:13 AM GMT
#సుశాంత్..భ‌న్సాలీ త‌ర్వాత మ‌రో బిగ్ షాట్ విచార‌ణ‌!
X
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మ‌హ‌త్య వ్య‌వ‌హారంపై పోలీసులు సీరియ‌స్ గా ద‌ర్యాప్తును కొన‌సాగిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే దాదాపు 34 మంది నుంచి వాంగ్మూలం తీసుకున్నారు. ఇంకా ఈ ద‌ర్యాప్తును కొన‌సాగిస్తూనే ఉన్నారు. కుటుంబ స‌భ్యులు .. స్నేహితుల స‌హా ప‌లువురి నుంచి వివ‌రాల్ని సేక‌రించిన పోలీసులు ఈ కేసును ర‌క‌ర‌కాల కోణాల్లో ద‌ర్యాప్తు చేస్తున్నారు. కేవ‌లం 34 వ‌య‌సులో సుశాంత్ సింగ్ బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి అస‌లు కార‌ణాలేమిటో క‌నిపెట్టాల‌ని మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వం ముంబై పోలీసుల్ని ఆదేశించ‌డంతో అంతే సీరియ‌స్ గా ద‌ర్యాప్తు సాగుతోంది.

ఇప్ప‌టికే సీబీఐ ద‌ర్యాప్తు కోసం అభిమానులు ఒత్తిడి తెస్తున్న నేప‌థ్యంలో ఈ కేసును పోలీసులు అంతే ఛాలెంజింగ్ గా తీసుకున్న‌ట్టు తెలుస్తోంది. మొన్న‌టికి మొన్న సుశాంత్ సింగ్ ప్ర‌స్తుత గాళ్ ఫ్రెండ్ రియా చ‌క్ర‌వ‌ర్తి.. ఆమె సోద‌రుడిని పోలీసులు విచారించారు. ఈ కేసులో భ‌న్సాలీ లాంటి అగ్ర ద‌ర్శ‌క‌నిర్మాత‌ను విచారించ‌డం ముంబై వ‌ర్గాల్లో హాట్ టాపిక్ అయ్యింది.

సంజ‌య్ లీలా భ‌న్సాలీ త‌ర్వాత తాజాగా మ‌రో బిగ్ షాట్ ని పోలీసులు విచారించారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌క‌నిర్మాత య‌శ్ రాజ్ ఫిలింస్ అధినేత అయిన‌ ఆదిత్య చోప్రా స్టేట్ మెంట్ ను శనివారం నాడు పోలీసులు రికార్డు చేశారు. వెర్సోవా పోలీసు స్టేషన్ లో ఈ విచార‌ణ సాగింద‌ని తెలుస్తోంది. భ‌న్సాలీ త‌ర‌హాలోనే దాదాపు నాలుగు గంట‌ల పాటు పోలీసులు సంధించిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న జ‌వాబులు ఇచ్చార‌ట‌.

ఆదిత్య చోప్రా .. ద‌ర్శ‌కనిర్మాత భ‌న్సాలీకి అత్యంత క్లోజ్ అన్న సంగ‌తి విధిత‌మే. సుశాంత్ సింగ్ పై ఆ ఇద్ద‌రి కుట్ర ఉంద‌న్న ఆరోప‌ణ‌లు వెల్లువెత్తిన నేప‌థ్యంలో ఆ ఇద్ద‌రినీ పోలీసులు విచారించ‌డం ఆస‌క్తి రేకెత్తిస్తోంది. ఇక ప‌రిశ్ర‌మ మాఫియాలో భాగం అన్న ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటున్న చోప్రా- భ‌న్సాలీ అల‌యెన్స్ ని విచారించారు.

సుశాంత్ మ‌ర‌ణించి నెల‌రోజులు అయిన త‌ర్వాతా ఇంకా సీరియ‌స్ మోడ్ లోనే కేసును విచారిస్తున్నారు. శుక్రవారం సుశాంత్ సింగ్ కి ట్రీట్ మెంట్ ఇస్తున్న‌ సైక్రియార్టిస్టు డా.కేర్సి చవ్డా ను పోలీసులు విచారించి వాంగ్మూలం తీసుకున్న సంగ‌తి విధిత‌మే. మ‌రో ముగ్గురు డాక్ట‌ర్ల నుంచి వాంగ్మూలం సేక‌రించారు. ఇంకా ఈ విచార‌ణ‌లో ఎలాంటి నిజాలు నిగ్గు తేల‌నున్నాయి? అన్న‌ది వేచి చూడాల్సిందే.