Begin typing your search above and press return to search.
దర్శకనిర్మాతల కొట్లాటతో `రామసేతు` ఆగిపోయినట్టేనా?
By: Tupaki Desk | 5 Jan 2021 5:00 AM ISTదర్శకనిర్మాతల మధ్య సఖ్యత ఉంటేనే ఏ ప్రాజెక్ట్ అయినా సక్సెస్ సాధిస్తుంది. లేదంటే మధ్యలోనే చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. వందల కోట్ల బడ్జెట్లకు సంబంధించిన వ్యవహారంలో ఏ చిన్న తేడా వచ్చినా అంతే సంగతి.
2020లో `రామ సేతు` పేరుతో భారీ పాన్ ఇండియా మూవీని ప్రకటించిన యష్ రాజ్ సంస్థ అధినేత ఆదిత్యా చోప్రాతో దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేదికి పొసగడం లేదని ఆ గొడవల్లో రామసేతు ప్రాజెక్ట్ గోల్ మాల్ అయినట్టేనని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతానికి YRF క్యాంప్ లో అందరి మధ్యా సఖ్యత సరిగా లేదు. తన సహచరులతో ఎంతో విధేయుడిగా ఉండే ఆదిత్య చోప్రా చంద్ర ప్రకాష్ తో సరిగా లేరని తెలుస్తోంది. ప్రస్తుతం ఇదే సంస్థలో పృథ్వీరాజ్ చిత్రానికి చంద్రప్రకాష్ ద్వివేది దర్శకత్వం వహిస్తున్నారు. కానీ అతడికి రిలీజ్ ప్రమోషన్స్ లో ప్రాధాన్యతనివ్వడం లేదని గుసగుసలు వేడెక్కిస్తున్నాయి.
రామ్ సేతు ప్రకటన తర్వాత `పృథ్వీరాజ్` దర్శకుడు చంద్రప్రకాష్ ద్వివేదితో ఆదిత్య చోప్రా విడిపోయారన్న ప్రచారం అంతకంతకు వేడెక్కిస్తోంది.
ఆదిత్య చోప్రా తన సొంత నటుల టీమ్.. దర్శకుల బృందంతో టాలెంట్ మేనేజ్మెంట్ ఏజెన్సీ లాగా యష్ రాజ్ ఫిల్మ్స్ ను నడుపుతున్నాడు. పృథ్వీరాజ్ చౌహాన్ కథకు చంద్రప్రకాష్ ఒక నిర్మాతను కనుగొనటానికి చాలా కష్టపడుతుండగా వైఆర్ఎఫ్ వారసుడు అతనిని రక్షించటానికి వచ్చాడు. అక్షయ్ కుమార్ నటించిన ఈ మూవీ చిత్రీకరణ ఇప్పటికే పూర్తి కాగా.. ఈ విభేధాలు బయటపడ్డాయి.
ఆదిత్య చోప్రా అతడిని అంతగా ద్వేషించడానికి కారణం ద్వివేది `రామ్ సేతు` ప్రకటన అని తెలుస్తోంది. ద్వివేది రామ సేతు స్క్రిప్ట్ ను అక్షయ్ కుమార్ తో చర్చించారు. దాంతో పాటే కంగారుగా అతను వెంటనే ఒక పోస్టర్ ను ముద్రించి ప్రకటనను అధికారికం చేసేశాడు.
కారణం ఏదైనా వైఆర్ఎఫ్ డైరెక్టర్ల విభాగం నుంచి చంద్రప్రకాష్ ను తొలగించారని తెలిసింది. పృథ్వీరాజ్ పోస్ట్ ప్రొడక్షన్ డ్యూటీల నుండి ద్వివేదిని తగ్గించాలని ఆదిత్య చోప్రా నిర్ణయించారట. అక్షయ్ కుమార్ -మానుషి చిల్లార్ నటించిన ఈ మూవీ ప్రస్తుతం ఎడిటింగ్ దశలో ఉంది. దర్శకుడు ఇందులో ఇకపై పాల్గొనడు. దర్శకుడి క్రెడిట్లలో అతని పేరు ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆదిత్య చోప్రానే ఎడిటింగ్ లో కూర్చోవాలని నిర్ణయించుకున్నాడు. ద్వివేది చేసిన దానితో అతను తీవ్రంగా బాధపడ్డాడని తెలుస్తోంది.