Begin typing your search above and press return to search.

న్యాచురల్ స్టార్ కు జోడీగా సమ్మోహనం బ్యూటీ

By:  Tupaki Desk   |   15 March 2019 7:58 AM GMT
న్యాచురల్ స్టార్ కు జోడీగా సమ్మోహనం బ్యూటీ
X
హైదరాబాద్ బ్యూటీనే అయినా బాలీవుడ్ భామలా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది అదితిరావ్ హైదరి. మొదట తమిళ డబ్బింగ్ సినిమా 'చెలియా' తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అదితి తర్వాత సుధీర్ బాబు-ఇంద్రగంటి మోహన కృష్ణ 'సమ్మోహనం' తో స్ట్రెయిట్ సినిమాలో నటించింది. ఈ సినిమాతో అదితి నటనకు మంచి మార్కులే దక్కాయి. ఇప్పుడు మరోసారి ఇంద్రగంటి సినిమాలో నటించబోతోందట.

ఇంద్రగంటి ప్రస్తుతం నాని - సుధీర్ బాబు హీరోలుగా ఒక సినిమా ప్లాన్ చేస్తున్నాడు. ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తారు. ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉంటారట. నానికి జోడీగా అదితిని ఎంపిక చేశారని అంటున్నారు. 'సమ్మోహనం' లో సుధీర్ బాబు కుజోడీగా నటించిన అదితిని ఈ చిత్రంలో నానికి జోడీగా ఎంపిక చేయడం ఒక సర్ ప్రైజే. మరోవైపు నాని సరసన గతంలో 'జెంటిల్మెన్'.. 'నిన్ను కోరి' చిత్రాలలో నటించిన నివేద థామస్ పేరును సుధీర్ కు జోడీగా పరిశీలిస్తున్నారని సమాచారం.

యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సుధీర్ బాబు ఒక పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తాడని.. నాని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్ర పోషిస్తాడని అంటున్నారు. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ సినిమా ఈ ఏడాది ద్వితీయార్థంలో సెట్స్ పైకి వెళ్తుందని.. ఈ ఏడాది చివర్లో విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారని సమాచారం.