Begin typing your search above and press return to search.

ఫ్యాషన్ ఫేస్ ఆఫ్: ది బెస్ట్ పింక్ గులాబి..?

By:  Tupaki Desk   |   29 April 2021 10:38 AM GMT
ఫ్యాషన్ ఫేస్ ఆఫ్: ది బెస్ట్ పింక్ గులాబి..?
X
సెలబ్రిటీల న‌డుమ నిరంత‌ర ఫ్యాష‌న్ ఫేసాఫ్ గురించి తెలిసిన‌దే. విమానాశ్రయంలో క‌నిపించినా లేదా వారి చిత్రాల ప్రమోషన్ల సమయంలో అయినా..తార‌లు వారి స్టైల్ స్టేట్మెంట్ పై ఎప్పుడూ జాగ్ర‌త్త‌గా ఉంటారు. ఈరోజుల్లో ఫ్యాషన్ ఫేసాఫ్ పెద్ద మ్యాట‌ర్ కాదు. తార‌లు ఎక్కువగా సారూప్యత ఉన్న ఫ్యాష‌న్స్ ని అనుక‌రించ‌డం చూసేదే. ఎంచుకునే శైలి.. రంగులు.. డిజైన్లు.. ఎల్లప్పుడూ దృష్టిని ఆకర్షించేవిగా ఉంటాయి. ఈసారి ఫ్యాషన్ ఫేస్-ఆఫ్ జాబితాలో అదితీరావు హైద‌రి.. రకుల్ ప్రీత్ సింగ్ ట్రెండ్ సెట్ట‌ర్స్ గా నిలుస్తున్నారు. ఆ ఇద్దరూ స్టైలింగ్ ప‌రంగా ఉత్తమంగా కనిపించిన సంద‌ర్భాల్ని గుర్తు చేసుకుంటే...

బాలీవుడ్ చిత్రం `దే దే ప్యార్ దే` ప్రమోషన్ల సందర్భంగా రకుల్ రెండు విభిన్న‌మైన‌ దుస్తులను ఎంచుకుంది. తన ట్యూబ్-టాప్ ను స్పెష‌ల్ ప్యాంటుతో డిజైన్ చేసిన తీరు ఆస‌క్తిక‌రం. గులాబీ వ‌ర్ణం కాటన్ రోజీ-హ్యూడ్ దుస్తుల్లో ఎంతో అందంగా డ్రీమ్ గాళ్ లా క‌నిపిస్తోంది.

అదితి రావు హైడారి ఇటీవల `ది గర్ల్ ఆన్ ది ట్రైన్` ప్రమోషన్స్ లో పింక్ గులాబీలా అందంగా ప్ర‌త్య‌క్ష‌మైంది. అదితి ఎంతో అందంగా పింక్ కో-ఆర్డ్స్ సెట్ ధరించి కనిపించింది . ఆ లేయర్డ్ నెక్ పీస్ ప్ర‌త్యేకంగా క‌నిపిస్తోంది. అతిదీ మ‌త్తు క‌ళ్ల‌తో అభిమానుల గుండెల్ని ట‌చ్ చేయ‌గా.. ర‌కుల్ ప్రీత్ స్మైలీ లుక్ తో పింక్ లో అద్భుతంగా క‌నిపిస్తోంది. ఎవ‌రికి వారే యూనిక్ గా అందంగా క‌నిపిస్తున్నారు ఈ దుస్తుల్లో.

కెరీర్ ప‌రంగా ర‌కుల్ ప్ర‌స్తుతం బాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉన్నారు. అదితీరావ్ హ‌ద‌రీ తెలుగు-త‌మిళం- హిందీ చిత్రాల్లో న‌టిస్తూ బిజీగా ఉన్న సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు వెబ్ సిరీస్ ల‌లోనూ స‌ద‌రు నాయిక‌లు న‌టిస్తున్నారు.