Begin typing your search above and press return to search.

యుద్ధకళ నేర్చుకుంటున్న స్టార్ హీరోయిన్.. అందుకేనా?

By:  Tupaki Desk   |   9 May 2020 3:30 PM GMT
యుద్ధకళ నేర్చుకుంటున్న స్టార్ హీరోయిన్.. అందుకేనా?
X
టాలీవుడ్ ఇండస్ట్రీలో వేరే ఇండస్ట్రీ నుండి వచ్చి సెటిల్ అవుతున్న హీరోయిన్లలో అదితి రావు హైదరి ఒకరు. అందం అభినయంతో వరుసగా సినీ అవకాశాలు దక్కించుకుంటున్న హైదరి.. ప్రస్తుతం నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందుతున్న 'వి' సినిమాలో నటిస్తుంది. తెలుగులో హైదరిని స్ట్రెయిట్ హీరోయిన్ గా సమ్మోహనం సినిమాతో పరిచయం చేసిన డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి మళ్లీ 'వి' సినిమాలో అవకాశం ఇచ్చారు. ఈ సినిమా హీరో నాని-డైరెక్టర్ మోహన్ కృష్ణ కాంబినేషన్లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కావడం విశేషం. ఇక ఈ సుందరి అందానికి అభిమానులు మిలియన్లలో ఉన్నారు. అదితి ఏం చేసినా అభిమానులు లైక్ కొట్టి వైరల్ చేస్తూనే ఉంటారు. లాక్ డౌన్ కారణంగా ఇంటికే పరిమితం అయిన హైదరి.. ఇటీవలే సైకో సినిమాతో తమిళ ఇండస్ట్రీలో అడుగుపెట్టింది.

ఇక సెలబ్రిటీలంతా లాక్ డౌన్ లో ఏదోకటి కొత్త పని నేర్చుకోవడం, వంట చేయడం, ఫిట్నెస్ మీద వర్కౌట్స్ చేయడం లేదా కుటుంబంతో టైం స్పెండ్ చేయడం చేస్తున్నారు. కానీ హైదరి భామ మాత్రం వెరైటీగా 'కలరిపయట్టు' అనే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటుంది. కేరళ రాష్ట్రానికి చెందిన ఈ యుద్ధ విద్యను ప్రాక్టీస్ చేస్తూ ఈరోజు సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో తను ఆమె పాదాలను గాల్లోకి లేపిన అరచేతులను తాకిస్తూ.. ముఖం మీద ప్లాట్ పడకుండా ఉండటానికి ట్రై చేస్తూ బ్లూస్ ని టచ్ చేస్తున్నట్లు పోస్ట్ కింద కాప్షన్ రాసింది. ఈ కలరిపయట్టు విద్య పురాతన యుద్ధకళలలో ఒకటి. అయితే కేరళలో మాత్రమే పుట్టిన ఈ విద్యను ఎందుకు నేర్చుకుంటుందో.. ఈ భామ చెప్పలేదు.

అయితే లాక్ డౌన్ కారణంగా ప్రాక్టీస్ చేస్తుందని అర్ధమవుతుంది. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం.. హైదరి ఈ కలరి యుద్ధకళను 'పొన్నియన్ సెల్వన్' అనే తమిళ సినిమా కోసం అని ప్రచారం జరుగుతుంది. స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'పొన్నియన్ సెల్వన్' సినిమా ఓ పురాతన కథ ఆధారంగా రూపొందుతుంది. అయితే ఈ సినిమా కోసమే అమ్మడు కష్టపడి నేర్చుకుంటుందట. అంతేగాక తాజాగా హైదరి.. రీసెంట్ గా మూడు మలయాళం సినిమాలను లైన్ లో పెట్టిందట. మరి ఆ సినిమాలలో ఈ కలరి విద్యకు సంబంధించి ఏదైనా పాత్ర చేస్తుందేమో అని సినీ వర్గాల టాక్. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. అసలు విషయం తెలియాలంటే కొంతకాలం వెయిట్ చేయాల్సిందే..