Begin typing your search above and press return to search.
బక్క చిక్కిన హాటీ.. సౌత్ లో ఆఫర్లిస్తారా?
By: Tupaki Desk | 21 Feb 2021 8:00 AM ISTచూస్తుంటే సన్నజాజి తీగలా మారిపోయింది అతిథీరావ్ హైదరీ. చూస్తుండగానే బొద్దుగుమ్మ కాస్తా ముద్దుగుమ్మ అయిపోయింది. మరీ ఇలా అయితే ఆఫర్లు ఇస్తారా? అన్నదే ఇప్పుడు అసలు పాయింట్. అసలే బొద్దుగుమ్మలకు గుడులు కట్టే కల్చర్ తంబీల్లో ఉంది. అలాంటప్పుడు అక్కడ ఆకట్టుకోవాలంటే మరీ ఇంత సైజ్ జీరోకి వచ్చేస్తే ఎలా? పైగా తెలుగు ఆడియెన్ కూడా ఇటీవల బక్క చిక్కితే ఒప్పుకోవడం లేదు. మరి ఇవన్నీ ఆలోచించే ఇలా జీరో సైజ్ ట్రై చేస్తోందా? అంటే... ఈ అన్ని ప్రశ్నలకు తాజాగా అమ్మడి నుంచే ప్రాక్టికల్ గా జవాబు వచ్చేసింది.
ఇదంతా త్వరలో సెట్స్ పైకి వెళ్లనున్న నెట్ ఫ్లిక్స్ సినిమాకోసమేనని అర్థమవుతోంది. నెట్‌ఫ్లిక్స్ తదుపరి చిత్రంలో అదితీరావు హైదరీ- కొంకణ సేన్ శర్మ కలిసి నటించనున్నారని తెలుస్తోంది. ఇది కూడా ఆంథాలజీనే. బాలీవుడ్ ప్రముఖ దర్శకులు రాజ్ మెహతా- నీరజ్ ఘైవాన్- శశాంక్ ఖైతాన్ తదితరులు కలిసి ఈ సిరీస్ కి పని చేయనున్నారని తెలిసింది.
ప్రఖ్యాత ధర్మ ప్రొడక్షన్స్ కి చెందిన డిజిటల్ ఆర్మ్ అయిన ధర్మాటిక్ ఇదివరకూ నెట్ ఫ్లిక్స్ తో చేతులు కలిపింది. మరోసారి రివర్టింగ్ ఆంథాలజీ `అజీబ్ దాస్తానే` కోసం కలిసి ముందుకొస్తున్నారని తెలిసింది. తాజా ప్రాజెక్ట్ కోసం దర్శకుల సూచన మేరకే అతిథీరావ్ ఇలా మారింది. ఇక పరిణీతి నటించిన ది గర్ల్ ఆన్ ట్రైన్ ప్రీమియర్ లోనూ అదితీ సందడి చేసిన సంగతి తెలిసిందే. అదితీ నటించిన వీ ఫ్లాపైన క్రమంలో తెలుగులో అవకాశాలు కూడా తగ్గాయి. అటుపై హిందీ పరిశ్రమపైనా దృష్టి సారిస్తోందన్నమాట.