Begin typing your search above and press return to search.

హాలీవుడ్ సినిమాలని ఫాలో అవనున్న 'ఆదిపురుష్'...!

By:  Tupaki Desk   |   8 Sept 2020 4:20 PM IST
హాలీవుడ్ సినిమాలని ఫాలో అవనున్న ఆదిపురుష్...!
X
యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ - బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబినేషన్ లో ''ఆదిపురుష్'' అనే సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 3-డీ లో రూపొందనున్న ఈ చిత్రాన్ని టీ - సిరీస్ భూషణ్ కుమార్ - కృష్ణ కుమార్ - ప్రసాద్ సుతార్ - రాజేష్ నాయర్ - ఓం రౌత్ లు కలిసి భారీ బడ్జెట్ తో నిర్మించనున్నారు. చెడుపై మంచి సాధించిన విజ‌యం అనే థీమ్‌ తో రానున్న ఈ మూవీలో ప్రతినాయకుడు 'లంకేష్' గా బాలీవుడ్ హీరో సైఫ్ అలీఖాన్ నటించనున్నాడు. లీడ్ క్యాస్ట్ ని ఫైనలైజ్ చేసే పనిలో ఉన్న ఓం రౌత్‌ ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుపుతున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ప్రారంభంలో 'ఆదిపురుష్' ని సెట్స్ పైకి తీసుకెళ్లి 2022లో రిలీజ్ చేసే విధంగా ప్లాన్స్ చేసుకుంటున్నారు.

కాగా, 3 డీ ఫార్మాట్ లో విజువల్ వండర్ లా రూపొందనున్న 'ఆదిపురుష్' చిత్రాన్ని హాలీవుడ్ తరహా చిత్రీకరణ చేయబోతున్నారట. ఈ సినిమాకి వీఎఫ్ఎక్స్ వర్క్స్ కీలకం కావడంతో వీలైనంత భాగం షూటింగ్ స్టూడియోలో గ్రీన్ మ్యాట్ మీద చిత్రీకరిస్తారని తెలుస్తోంది. బడ్జెట్ లో ఎక్కువ భాగం వీఎఫ్ఎక్స్‌ కే ఖర్చు చేయనున్నారట. హాలీవుడ్ చిత్రాలకు పనిచేసిన వీఎఫ్ఎక్స్‌ సూపర్వైజర్స్ ని 'ఆదిపురుష్' కోసం తీసుకురాబోతున్నారట. గతంలో ప్రభాస్ నటించిన వెండితెర అద్భుతం 'బాహుబలి' సినిమాలో కొన్ని సన్నివేశాలను గ్రీన్ మ్యాట్ పై చిత్రీకరించిన సంగతి తెలిసిందే. ఇక నాగ్ అశ్విన్ - ప్రభాస్ కాంబినేషన్ లో తెరకెక్కనున్న సైన్స్ ఫిక్షనల్ మూవీని కూడా అబ్బురపరిచే విజువల్ ఎఫెక్ట్స్ తో రూపొందిస్తారని తెలుస్తోంది.