Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్‌' హీరోయిన్‌ ప్రకటన?

By:  Tupaki Desk   |   1 Oct 2020 11:10 AM GMT
ఆదిపురుష్‌ హీరోయిన్‌ ప్రకటన?
X
ప్రభాస్‌ హీరోగా బాలీవుడ్‌ స్టార్‌ డైరెక్టర్‌ ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న 'ఆదిపురుష్‌' సినిమా షూటింగ్‌ ను వచ్చే ఏడాది జనవరి నుండి ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇప్పటికే స్క్రిప్ట్‌ వర్క్‌ దాదాపుగా పూర్తి అయ్యింది. సినిమా షూటింగ్‌ కోసం సెట్స్‌ ను ఏర్పాటు చేస్తున్నారు. ఎక్కువగా ఈ సినిమాను బ్లూ మ్యాట్‌ లో చిత్రీకరించబోతున్నట్లుగా బాలీవుడ్‌ మీడియా వర్గాల నుండి సమాచారం అందుతోంది. ఇప్పటికే ఈ సినిమా విలన్‌ సైఫ్‌ అలీ ఖాన్‌ అంటూ అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక ఈ సినిమా నుండి రాబోతున్న తదుపరి ప్రకటన హీరోయిన్‌ విషయం అంటూ బాలీవుడ్‌ వర్గాల నుండి సమాచారం అందుతోంది.

ఆదిపురుష్‌ హీరోయిన్‌ ఎవరు అనే విషయమై గత కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. కీర్తి సురేష్‌ నుండి కియారా అద్వానీ వరకు ఎంతో మంది హీరోయిన్స్‌ ను ఈ సినిమా కోసం తీసుకున్నట్లుగా ప్రచారం జరిగింది. కాని ఇప్పటి వరకు ఎవరు ఆదిపురుష్‌ సినిమాలో నటించబోతున్నారు అనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఈ సినిమా రామాయణం ఇతివృత్తంతో రూపొందుతున్న విషయం తెల్సిందే. హీరోయిన్‌ అంటే సీత పాత్ర. కనుక సీత పాత్రకు ఎవరు అయితే బాగుంటుంది అనే విషయమై ఇప్పటికే యూనిట్‌ సభ్యులు ఒక క్లారిటీకి వచ్చారట. ఆ విషయాన్ని ఈ నెల చివరి వరకు ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.