Begin typing your search above and press return to search.

ఎన్టీఆర్‌30 కోసం 'ఆదిపురుష్‌' స్టార్‌

By:  Tupaki Desk   |   29 March 2021 9:30 AM GMT
ఎన్టీఆర్‌30 కోసం ఆదిపురుష్‌ స్టార్‌
X
యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ 30వ సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందబోతున్న విషయం తెల్సిందే. గత ఏడాదిలోనే ప్రకటన వచ్చినా కూడా కరోనా వల్ల ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు. వచ్చే నెలలో ఎన్టీఆర్‌ చేస్తున్న ఆర్‌ఆర్‌ఆర్‌ మూవీ షూటింగ్‌ పూర్తి అవ్వబోతుంది. కనుక మే నుండి ఎన్టీఆర్‌ 30వ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఇటీవలే హీరోయిన్ గా రష్మిక మందన్నాను త్రివిక్రమ్‌ కన్ఫర్మ్‌ చేశాడనే వార్తలు వస్తున్నాయి. ఆమె కు కథ చెప్పడంతో పాటు ఇతర విషయాల గురించి కూడా చర్చించారట. ఇక విలన్ గురించిన చర్చ జరుగుతుంది.

సినీ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఎన్టీఆర్‌ 30 కి పాన్ ఇండియా క్రేజ్ ను తెచ్చి పెట్టేందుకు అన్నట్లుగా సినిమా లో బాలీవుడ్‌ స్టార్‌ ను విలన్ గా నటింపజేయాలని నిర్ణయించారట. అందుకే ఆదిపురుష్‌ సినిమా తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న బాలీవుడ్‌ స్టార్‌ సైఫ్‌ అలీ ఖాన్ ను ఎన్టీఆర్‌ 30 సినిమాలో నటింపజేయబోతున్నట్లుగా తెలుస్తోంది. భారీ అంచనాల నడుమ రూపొందనున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కు పోటీగా సైఫ్‌ అలీ ఖాన్‌ ను తీసుకు వస్తే ఖచ్చితంగా సినిమా రేంజ్ మరో లెవల్‌ లో ఉంటుందని ఇండస్ట్రీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై త్రివిక్రమ్‌ టీమ్‌ నుండి క్లారిటీ రావాల్సి ఉంది.