Begin typing your search above and press return to search.

ఆదిపురుష్ సీత క‌ష్టాలు.. పాఠాలు - హోం వ‌ర్క్ తో ఫుల్ బిజీ!

By:  Tupaki Desk   |   25 March 2021 8:30 AM GMT
ఆదిపురుష్ సీత క‌ష్టాలు.. పాఠాలు - హోం వ‌ర్క్ తో ఫుల్ బిజీ!
X
అయితే.. సీత పాత్ర ఎంత క‌ఠిన‌మైందో అంద‌రికీ తెలిసిందే. భ‌ర్త అడుగు జాడ‌ల్లో న‌డిచే స‌తీమ‌ణిగా, క‌రుణామూర్తిగా పూర్తి సాత్వికంగా క‌నిపించాల్సి ఉంటుంది. ఇలాంటి పాత్రలో తాను న‌టిస్తుండ‌డం గొప్ప గౌర‌వంగా ఫీల‌వుతున్నాన‌ని ప్ర‌క‌టించింది కృతి.

కానీ.. సీతగా న‌టించి, మెప్పించ‌డం అనేది సాధార‌ణ విష‌యం కాదు. అది ఒక స‌వాల్‌. అందుకే.. సీత‌పాత్ర‌లో ప‌ర‌కాయ ప్ర‌వేశం చేసేందుకు ట్రైనింగ్ తీసుకుంటోంద‌ట కృతి. న‌డ‌క‌, న‌డ‌త మొద‌లు అన్ని విష‌యాల్లోనూ జాగ్ర‌త్త‌లు తీసుకుంటోంద‌ట‌. ఇక‌, తెలుగు నేర్చుకునేందుకు ప్ర‌త్యేకంగా ఓ ట్యూట‌ర్ ను కూడా నియ‌మించుకుంద‌ట‌. ఆ విధంగా.. తెలుగు డైలాగ్స్ కూడా స్వ‌యంగా చెప్పేందుకు సిద్ధ‌మ‌వుతోంద‌ట కృతి స‌న‌న్‌.

ఇక‌, ‘ఆదిపురుష్‌’లో ప్రభాస్ ఎలా కనిపించబోతున్నాడనే ఆస‌క్తి కూడా అంద‌రిలోనూ నెల‌కొంది. ఈ నేప‌థ్యంలో ఏప్రిల్ 21న శ్రీరామ‌న‌వ‌మి ప‌ర్వ‌దినం సంద‌ర్భంగా ప్రభాస్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేయ‌నున్నార‌నే ప్ర‌చారం కూడా సాగుతోంది. ఈ సినిమాలో ల‌క్ష్మ‌ణుడి క్యారెక్ట‌ర్లో స‌న్నీ సింగ్ నిజ్జర్ క‌నిపించ‌బోతున్నారు. రావ‌ణుడి పాత్ర‌ను బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ పోషిస్తున్నారు.

సుమారు రూ.400 కోట్ల బ‌డ్జెట్ తో తెర‌కెక్కుతున్న ఈ చిత్రంలో.. వీఎఫ్ ఎక్స్ వ‌ర్క్ భారీగా ఉంటుంద‌ని స‌మాచారం. చిత్రీక‌ర‌ణ త్వ‌రగా ఫినిష్ చేసి, ఈ వ‌ర్క్ మీద‌నే ఎక్కువ స‌మ‌యం కేటాయించ‌బోతున్నాడ‌ట ద‌ర్శ‌కుడు. వ‌చ్చే ఏడాది ఆగ‌స్టు 11న ఈ చిత్రాఆన్ని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేక‌ర్స్‌.