Begin typing your search above and press return to search.

పండక్కి డబుల్ ట్రీట్ 'ఆది పురుష్ ' అప్డేట్ పక్కా..

By:  Tupaki Desk   |   13 Nov 2020 12:20 PM IST
పండక్కి డబుల్ ట్రీట్  ఆది పురుష్  అప్డేట్ పక్కా..
X
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ దివాళీకి ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నాడు. ఇప్పటికే రాధేశ్యామ్ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్లు విడుదల చేయగా.. ఈసారి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఆది పురుష్ కు మూవీకి సంబంధించి అప్డేడ్ ఇస్తారని తెలుస్తోంది. సాహో టైంలో యూవీ నిర్మాతలు ఆ సినిమాకు సంబంధించి ఎటువంటి సమాచారం ఇవ్వకపోవడంతో ఫ్యాన్స్ పలుసార్లు ట్వీట్లతో విమర్శల వర్షం కురిపించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రాధే శ్యామ్ మూవీ విషయంలోనూ ఇలాగే జరిగింది. ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి విషయం బయటికి తెలియడం లేదని, కనీసం అప్పుడప్పుడైనా ఏదో ఒక అప్డేట్ ఇవ్వాలని ఫ్యాన్స్ రిక్వెస్ట్ చేశారు.

దీంతో ప్రభాస్ ఇటీవలికాలంలో వరుసగా సినిమాలకు సంబంధించిన అప్డేట్ లు రెగ్యులర్ గా ఇస్తున్నారు. అంతేకాదు అంతకు ముందు ప్రభాస్ ఏ కార్యక్రమంలో పాల్గొన్న అందుకు సంబంధించి వివరాలు తెలిసేవి కావు. ఇప్పుడు ప్రభాస్ కాస్త వ్యవహారశైలిని కాస్త మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. వరుసగా తన వ్యక్తిగత కార్యక్రమాలకు సంబంధించిన ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో విడుదల చేస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు. సాహో టైంలో జరిగిన తప్పులు జరగకుండా జాగ్రత్త పడుతున్నాడు. ఇప్పుడు దీపావళిని పురస్కరించుకుని ఆది పురుష్ సినిమాకు సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం కనిపిస్తోంది.

ఆదిపురుష్ రెగ్యులర్ షూటింగ్ జనవరి నుంచి ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి పండుగ ముగిసిన తరువాత ఇది ఒక కొలిక్కి వస్తుంది. ఈ సినిమాకోసం ప్రభాస్ తన లుక్ ని కూడా మార్చుకునే పనిలో పడ్డాడట. కాగా ఆది పురుష్ ను రూ. 500 కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ కు ప్రాధాన్యం ఇస్తున్నారు. సినిమా లో ఇవే హైలైట్ గా నిలవనున్నాయి. అందుకోసం మేకర్స్ భారీగానే ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇంకా ఈ సినిమాలో హీరోయిన్ ఫైనల్ అవ్వలేదు. ఈ సినిమా కంప్లీట్ అయిన తర్వాత ప్రభాస్ నాగ అశ్విన్ సినిమాకు డేట్స్ ఇవ్వనున్నారు.