Begin typing your search above and press return to search.

'ఫిజికల్'గా సన్నద్ధం అవుతున్న ఆదిపురుష్ యాక్టర్..!

By:  Tupaki Desk   |   13 May 2021 6:30 AM GMT
ఫిజికల్గా సన్నద్ధం అవుతున్న ఆదిపురుష్ యాక్టర్..!
X
డార్లింగ్ ప్రభాస్ బాహుబలి మూవీతో పాన్ ఇండియా స్టార్ స్టేటస్ అందుకున్నాడు. అందుకే ప్రస్తుతం అన్ని పాన్ ఇండియా సినిమాలే లైన్ లో పెట్టేసాడు. దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ప్రభాస్ మూవీస్ కోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. ప్రెసెంట్ ప్రభాస్ సాలిడ్ యాక్షన్ మూవీ 'సలార్'తో పాటు పౌరాణికచిత్రం ఆదిపురుష్ చేస్తున్నాడు. ప్రస్తుతం ఆదిపురుష్ మూవీ రోజుకో వార్తతో హల్చల్ చేస్తోంది. దేశంలో కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ థియేటర్స్ అన్ని ఎక్కడివక్కడే మూతపడ్డాయి. సినీబృందాలు అన్నికూడా ఇళ్ళకే పరిమితమయ్యాయి.

అయితే షూటింగ్స్ లేకపోయే సరికి సెలబ్రిటీలు సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తో ఇంటరాక్ట్ అవుతున్నారు. ప్రస్తుతం ఆదిపురుష్ సినిమాలో లక్ష్మణుడు పాత్రలో నటిస్తున్న బాలీవుడ్ యాక్టర్ సన్నీసింగ్ ఫిజికల్ గా సన్నద్ధం అవుతున్నాడట. ఈ విషయాన్నీ స్వయంగా తానే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు. డైరెక్టర్ ఓం రౌత్ చెప్పినట్లుగా లక్ష్మణుడు పాత్రకోసం శారీరకంగా ధృడంగా బాడీని మేకోవర్ చేస్తున్నానని చెప్పుకొచ్చాడు. రెగ్యులర్ గా జిమ్ లో తెగకష్టపడుతున్నానని చెప్పాడు సన్నీ. తానాజీ ఫేమ్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్నటువంటి ఆదిపురుష్ సినిమా షూటింగ్ ముంబైలో నిలిచిన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఆదిపురుష్ రెండు నెలల షూటింగ్ పూర్తిచేసుకుంది.

ఇంకా మూడు నెలల షూటింగ్ బాలన్స్ ఉందట. అయితే ఫస్ట్ నుండి కూడా ఆదిపురుష్ షూటింగ్ ముంబైలోని ఓ ప్రైవేట్ స్టూడియోలో జరుగుతుంది. అలాగే పూర్తిగా ఇండోర్ లోనే షూట్ జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం.. ఆదిపురుష్ బృందం త్వరలోనే హైదరాబాద్ లో షూటింగ్ జరిపే ఆలోచనలో ఉన్నారు. ముంబైలో కరోనా మహమ్మారి ప్రభావం తీవ్రంగా ఉండటంతో లాక్డౌన్ పడి షూటింగ్ జరిపే అవకాశం లేదు. అందుకే ఆదిపురుష్ బృందం హైదరాబాద్ లో షూటింగ్ కంప్లీట్ చేయాలనీ భావిస్తున్నట్లు తెలుస్తుంది. అయితే హైదరాబాద్ లో లాక్డౌన్ ముగిసాక షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ సినిమాలో కృతిసనన్ సీతగా నటిస్తుండగా.. సైఫ్ అలీఖాన్ రావణ్ పాత్రలో కనిపించనున్నాడు. వచ్చేఏడాది ఆగష్టులో సినిమా రిలీజ్ కాబోతుంది.