Begin typing your search above and press return to search.

షూటింగ్‌ ఆగలేదు.. శ్రీరాముడిని కరోనా ఏం చేస్తుంది?

By:  Tupaki Desk   |   14 April 2021 8:30 AM GMT
షూటింగ్‌ ఆగలేదు.. శ్రీరాముడిని కరోనా ఏం చేస్తుంది?
X
గత ఏడాది కరోనా కారణంగా అన్ని భాషల సినిమా ఇండస్ట్రీలు దాదాపుగా మూడు నాలుగు నెలల పాటు పూర్తిగా స్థంభించిన విషయం తెల్సిందే. మెల్ల మెల్లగా షూటింగ్‌ లు యధావిధిగా సాగుతున్న సమయంలో సెకండ్‌ వేవ్‌ అంటూ ఆందోళన కలిగించే రీతిలో కరోనా కేసులు నమోదు అవుతున్నాయి. చిత్ర పరిశ్రమలో కూడా కరోనా సెకండ్‌ వేవ్‌ విపరీతంగా కనిపిస్తుంది. అన్ని భాషలకు చెందిన వారు కూడా కరోనా బారిన పడుతున్నారు. దాంతో ఇప్పటికే చాలా సినిమాల షూటింగ్‌ లు నిలిచి పోయాయి. సినిమా ఈవెంట్‌ లు షూటింగ్‌ లు అన్ని వాయిదా పడుతున్నాయి. ఇటీవల ప్రభాస్ నటిస్తున్న ఆదిపురుష్‌ కూడా కరోనా కారణంగా ఆగిపోయింది అంటూ వార్తలు వచ్చాయి.

దర్శకుడు ఓమ్‌ రౌత్‌ తో పాటు చిత్ర యూనిట్‌ సభ్యులు కొందరు కరోనా బారిన పడ్డారనే వార్తలు జోరుగా వచ్చాయి. అందుకే సినిమా షూటింగ్‌ కు రెండు వారాల పాటు బ్రేక్‌ ఇచ్చినట్లుగా వచ్చిన వార్తలను దర్శకుడు ఓమ్‌ రౌత్‌ ఖండించాడు. ఇప్పటి వరకు ఆదిపురుష్‌ సినిమా సెట్‌ లో ఏ ఒక్కరికి కూడా కరోనా పాజిటివ్‌ అంటూ నిర్థారణ అవ్వలేదని క్లారిటీ ఇచ్చాడు. షూటింగ్‌ ఏమాత్రం బ్రేక్‌ లేకుండా కొనసాగుతుంది అంటూ ఓమ్‌ రౌత్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఆదిపురుష్‌ సినిమాకు కరోనా ఇబ్బంది లేకుండా సాఫీగా షూటింగ్‌ సాగుతుందని యూనిట్‌ సభ్యుల ద్వారా క్లారిటీ రావడంతో ప్రభాస్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

రాముడిపై తీస్తున్న సినిమా అవ్వడం వల్ల ఆదిపురుష్‌ ను కరోనా ఏమీ చేయలేక పోతుందని కొందరు అభిమానులు సోషల్‌ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. రాముడి లుక్ లో ఉన్న ప్రభాస్‌ కరోనా ను పారదోలుతున్నట్లుగా మీమ్స్‌ ను కూడా ప్రభాస్‌ ఫ్యాన్స్‌ క్రియేట్‌ చేస్తున్నారు. ఇతర సినిమాలపై కరోనా ప్రభావం ఉన్నా రాముడిని కరోనా ఏం చేయలేక పోతుందని కొందరు అంటున్నారు. మొత్తానికి ఆదిపురుష్‌ షూటింగ్‌ అనుకున్నట్లుగా సాఫీగా సాగిపోతుందని అంటున్నారు.