Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్‌' బడ్జెట్‌ లో 60 శాతం దానికోసమేనట!

By:  Tupaki Desk   |   21 March 2021 11:14 AM GMT
ఆదిపురుష్‌ బడ్జెట్‌ లో 60 శాతం దానికోసమేనట!
X
బాలీవుడ్ లో ప్రభాస్ చేస్తున్న మొదటి సినిమా ఆదిపురుష్‌. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు ఓం రౌత్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. రాముడిగా ప్రభాస్ నటిస్తున్న ఈ సినిమాలో సీత పాత్రను కృతి సనన్‌ చేస్తన్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. ఇక రావణుడిగా సైఫ్‌ అలీ ఖాన్‌ నటిస్తున్నాడు. భారీ స్టార్‌ కాస్టింగ్‌ ఉన్న ఈ సినిమాను 500 కోట్లకు పై చిలుకు బడ్జెట్‌ తో రూపొందిస్తున్నారు. ఈ సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ కూడా రాజీ పడకుండా అద్బుతమైన విజువల్ వండర్ గా హాలీవుడ్ స్టార్స్ కూడా ఆశ్చర్యపడేలా ఈ సినిమాను రూపొందించే ఉద్దేశ్యంతో కేవలం విజువల్‌ ఎఫెక్ట్స్ కోసం 300 కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.

హాలీవుడ్‌ సినిమాలకు వర్క్‌ చేసిన విజువల్ ఎఫెక్ట్‌ ఎక్స్‌ పర్ట్స్‌ ను ఈ సినిమా కోసం వర్క్‌ చేయిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మోషన్‌ క్యాప్చర్ తో పాటు అనేక రకాలుగా ఈ సినిమా కోసం విజువల్‌ ఎఫెక్ట్స్ ను వాడబోతున్నారు. అద్బుతమైన విజువల్‌ వండర్ గా సినిమా ను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు దర్శకుడు సినిమా బడ్జెట్‌ లో ఏకంగా 60 శాతంకు పైగానే విజువల్ ఎఫెక్ట్స్‌ కోసం ఖర్చు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. వచ్చే ఏడాదిలో రాబోతున్న ఈ సినిమా టార్గెట్‌ వెయ్యి కోట్లకు పైగానే అంటూ ఇప్పటి నుండే ప్రభాస్ అభిమానులు నమ్మకం పెట్టుకుని వెయిట్‌ చేస్తున్నారు.