Begin typing your search above and press return to search.

ఆదిపురుష్‌ : టీజర్‌ పై ట్రోల్స్ తో కీలక మార్పులు?

By:  Tupaki Desk   |   1 Nov 2022 11:30 PM GMT
ఆదిపురుష్‌ : టీజర్‌ పై ట్రోల్స్ తో కీలక మార్పులు?
X
యంగ్‌ రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందిన భారీ మోషన్ గ్రాఫిక్స్ మూవీ ఆదిపురుష్‌ సంక్రాంతి కానుకగా విడుదల కాబోతున్నట్లుగా మొన్నటి వరకు చిత్ర యూనిట్‌ సభ్యులు బలంగా వాదించిన విషయం తెల్సిందే. దసరా సందర్భంగా టీజర్‌ విడుదల చేసిన సమయంలో కూడా విడుదల తేదీని సంక్రాంతికే అంటూ బలంగా చెబుతూ వచ్చారు.

తాజాగా సినిమా ను సంక్రాంతికి విడుదల చేయలేక పోతున్నాం అంటూ బయ్యర్లకు ఆదిపురుష్ చిత్ర నిర్మాతలు తెలియజేయడంతో అధికారికంగా సినిమా విడుదల వాయిదా పడ్డట్లు అయ్యింది. సంక్రాంతి బరి నుండి తప్పుకున్న ఆదిపురుష్ వచ్చే ఏడాది సమ్మర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సమయంలో సినిమా గురించి ఆసక్తికర పుకారు షికారు చేస్తోంది.

ఆదిపురుష్ టీజర్ విడుదల అయిన తర్వాత విపరీతమైన ట్రోల్స్ వచ్చిన విషయం తెల్సిందే. చిన్న పిల్లల కార్టూన్ చూసినట్లుగా ఉందంటూ చాలా మంది టీజర్ లోని కొన్ని విజువల్స్ ను విమర్శించారు. దాంతో ఇప్పుడు ఆదిపురుష్ లో మార్పులు మొదలు అయ్యాయి అంటూ సమాచారం అందుతోంది.

ఇప్పటికే గ్రాఫిక్స్ వర్క్‌ పూర్తి చేసిన కూడా మళ్లీ చాలా సన్నివేశాలకు గ్రాఫిక్స్ వర్క్‌ ను చేయబోతున్నట్లుగా సమాచారం అందుతోంది.

ఒకటి కాదు రెండు కాదు ఏకంగా వంద కోట్ల రూపాయలను అదనంగా పెట్టి కొత్తగా వీఎఫ్‌ఎక్స్ షాట్స్ ను కొత్తగా డిజైన్ చేయిస్తున్నారు అంటూ వార్తలు వస్తున్నాయి.

వంద కోట్ల గ్రాఫిక్స్ ను మళ్లీ చేయాలి అంటే రెండు మూడు నెలల్లో అయ్యేది కాదు. కనుక ఆదిపురుష్ విడుదల వచ్చే ఏడాది సమ్మర్ లో కూడా ఉండటం అనుమానమే అన్నట్లుగా కొందరు మీడియా సర్కిల్స్ వారు గుసగుసలాడుకుంటున్నారు. ఆదిపురుష్ కొత్త విడుదల తేదీ వచ్చేప్పటి వరకు ఏదో ఒక పుకారు పుడుతూనే ఉంటుంది. అదనంగా వంద కోట్లు ఖర్చు చేస్తే సరే కానీ ఈసారి అయినా మంచి ఔట్ పుట్‌ ఇస్తారా అంటూ కొందరు నెటిజన్స్ ప్రశ్నిస్తున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.