Begin typing your search above and press return to search.

ఆదిపురుష్‌ ఓ హాలీవుడ్‌ మూవీ

By:  Tupaki Desk   |   2 Dec 2020 11:00 PM IST
ఆదిపురుష్‌ ఓ హాలీవుడ్‌ మూవీ
X
ప్రభాస్‌ అభిమానులతో పాటు దేశ వ్యాప్తంగా సినీ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా 'ఆదిపురుష్‌' అనడంలో సందేహం లేదు. ఓం రౌత్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకు ఆకాశమే హద్దుగా పెరిగి పోతున్నాయి. ప్రభాస్‌ రాముడిగా.. సైఫ్‌ అలీ ఖాన్‌ రావణుడిగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ మరి కొన్ని రోజుల్లో ప్రారంభం కాబోతున్నాయి. ఈ సినిమాను విజువల్‌ వండర్‌ గా తీర్చిదిద్దేందుకు దర్శకుడు ఓం రౌత్‌ ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇప్పటి వరకు ఇండియన్‌ సినీ పరిశ్రమలో రాని విధంగా ఈ సినిమా ఉంటుందని మొదటి నుండి చెబుతున్నారు. అవతార్‌ మూవీ ఎలా అయితే ఫాంటసీ మరియు రియాల్టీ కలిసి ఉంటుందో అలాగే ఈ సినిమా కూడా ఒక అద్బుతమైన ప్రపంచానికి ప్రేక్షకులను తీసుకు పోయే విధంగా ఉంటుందని అంటున్నారు.

ఆదిపురుష్‌ షూటింగ్‌ కేవలం నాలుగు అయిదు నెలలు.. మా అయితే ఆరు నెలలు అంతకు మించి చేయరని తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమా షూటింగ్‌ కంటే విజువల్‌ ఎఫెక్ట్స్‌ పై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. సాదారణ బడ్జెట్‌ కంటే కంటే కూడా వీఎఫ్‌ఎక్స్‌ కు ఖర్చు చేస్తున్నారట. ప్రస్తుతం అవతార్‌ సీక్వెల్స్‌ కు పని చేస్తున్న విజువల్‌ ఎఫెక్ట్స్‌ ఎక్స్‌ పర్ట్స్‌ ను ఈ సినిమా కోసం రంగంలోకి దించబోతున్నారు. రోజుకు లక్షల పారితోషికంతో వారిని ఈ సినిమాకు పని చేయించబోతున్నారట. 500 కోట్ల బడ్జెట్‌ అనుకున్నా అది మరింతగా పెరిగే అవకాశం ఉందంటూ బాలీవుడ్‌ వర్గాల వారు అంటున్నారు.

ఇదో బాలీవుడ్‌ సినిమాలా కాకుండా హాలీవుడ్‌ రేంజ్‌ లో హాలీవుడ్‌ మూవీగానే రూపొందించాలనే ఉద్దేశ్యంతో దర్శకుడు ఓం రౌత్‌ ఉన్నట్లుగా అనిపిస్తుంది. ప్రభాస్‌ ఈ సినిమాతో పాన్‌ ఇండియా స్టార్‌ ను మించి హాలీవుడ్‌ రేంజ్‌ లో గుర్తింపు దక్కించుకుంటాడు అనడంలో సందేహం లేదు అనిపిస్తుంది. ఆదిపురుష్‌ ను హాలీవుడ్‌ మూవీస్‌ రేంజ్‌ లో ఒక విజువల్‌ వండర్‌ గా తీర్చి దిద్దేందుకు దర్శకుడు ఓం రౌత్‌ వందల కోట్లను ఖర్చు చేసేందుకు కూడా సిద్దంగా ఉన్నాడు అంటూ బాలీవుడ్‌ మీడియా వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.