Begin typing your search above and press return to search.

'ఆదిపురుష్' ఇంట్రెస్టింగ్ అప్డేట్

By:  Tupaki Desk   |   27 March 2021 8:47 AM GMT
ఆదిపురుష్ ఇంట్రెస్టింగ్ అప్డేట్
X
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రూపొందుతున్న మొదట బాలీవుడ్ మూవీ 'ఆదిపురుష్' షూటింగ్ ముంబై లో శరవేగంగా జరుగుతోంది. సినిమా షూటింగ్ దాదాపు మొత్తం కూడా గ్రీన్ మ్యాట్ పై షూట్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఫైట్స్ నుండి మొదలుకుని పాటల వరకు అన్ని కూడా విజువల్ వండర్ గానే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ప్రభాస్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు ఓం రౌత్ ప్రస్తుతం ప్రభాస్ మరియు కృతి సనన్ ల కాంబోలో పాటను చిత్రీకరించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.

రాముడిగా ప్రభాస్.. సీతగా కృతి సనన్ నటిస్తున్న సినిమా షూటింగ్ ను ఈ ఏడాది ద్వితీయార్ధం వరకు పూర్తి చెయ్యాలనే పట్టుదలతో దర్శకుడు ఓం రౌత్ ఉన్నట్లుగా బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఈ సినిమా దాదాపుగా 550 కోట్ల రూపాయలతో రూపొందుతుంది. బడ్జెట్ లో 60 శాతం గ్రాఫిక్స్ వర్క్ కోసం వినియోగించబోతున్నారట. భారీ స్టార్ కాస్ట్ తో విజువల్ వండర్ గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.