Begin typing your search above and press return to search.
ఆదిపురష్ ఆలస్యం..అమృతమే!
By: Tupaki Desk | 27 Sep 2022 2:30 PM GMTరామాయణం ఆధారంగా తెరపైకి వస్తున్న ఆదిపురుష్ సినిమా కోసం రెబల్ స్టార్ అభిమానులు మాత్రమే కాకుండా దేశ వ్యాప్తంగా ఉన్న ఎంతోమంది రామ భక్తులు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఒక విధంగా డివోషనల్ కేటగిరీలో ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టే అవకాశం అయితే ఎక్కువగానే ఉంది. చాలా రోజుల తర్వాత ఒక అగ్ర హీరో నుంచి వస్తున్న మైథాలజికల్ ఫిలిం కావడంతో అంచనాలు అయితే మామూలుగా ఉండవు అని చెప్పవచ్చు.
అయితే ఈ సినిమా అప్డేట్స్ విషయంలో చిత్ర యూనిట్ సభ్యులు ఒక విధంగా చాలా ఆలస్యం చేశారు. మొత్తానికి అక్టోబర్ రెండవ తేదీన అయోధ్యలో ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేయనున్నట్లు క్లారిటీ అయితే ఇచ్చారు. అసలైతే ఇంతకుముందే దర్శకుడు ఓం రౌత్ రెండు సార్లు అప్డేట్ రాబోతున్నట్లు చెప్పి ఆ తర్వాత ఎలాంటి అప్డేట్ అయితే ఇవ్వలేదు. ముఖ్యంగా ప్రభాస్ పుట్టిన రోజు సందర్భంగా ఫ్యాన్ మేడ్ పోస్టర్లను విడుదల చేయడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
అయితే ఈసారి తప్పకుండా ఫస్ట్ లుక్ టీజర్ అయితే రెడీ అయినట్లుగా తెలుస్తోంది. ఇక 2021 ఫిబ్రవరిలో ఈ సినిమా పనులు మొదలయ్యాయి. రెగ్యులర్ షూటింగ్ అయితే గత ఏడాది నవంబర్ లోనే స్టార్ట్ అయింది.
ఇక ఫస్ట్ లుక్ కోసం ఇంత ఎక్కువ సమయం తీసుకోవడం అనేది చాలా రిస్క్ తో కూడుకున్న పని. వారికి ఎన్ని ప్రణాళికలు ఉన్నా కూడా ఫ్యాన్ ఇండియా సినిమా కాబట్టి నిత్యం ఆడియన్స్ మైండ్ సెట్ ను సినిమాపై పడేలా చేస్తూ ఉండాలి.
అయితే దర్శకుడు ఇంతలా ఆలస్యం చేయడానికి ఒక కారణం ఉందట. దేశమంతా ఇటీవల కాలంలో కాస్త డివోషనల్ టైపు సినిమాలకు ఎక్కువగా అట్రాక్ట్ అవుతున్నారు. దేశభక్తి అలాగే దైవం అనగానే సినిమాలకు భారీ స్థాయిలో రెస్పాన్స్ అయితే వస్తోంది.
ఇక సినిమాకు క్రియేట్ చేస్తే హైప్ ఒకేసారి క్రియేట్ చేయాలి అని విడుదలకు కరెక్ట్ గా మూడు నెలల ముందు ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ టీజర్ తో పాటు ఆ తర్వాత సాంగ్స్ అలాగే వివిధ రకాల పోస్టర్స్ విడుదల చేస్తూ కరెక్ట్ గా రిలీజ్ సమయానికి భారీ స్థాయిలో హైప్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేసుకున్నారు. ఇక సినిమాను జనవరి 12వ తేదీన విడుదల చేయాలని డిసైడ్ అయిన విషయం తెలిసిందే. ఒక విధంగా ఈ ఆలస్యం సినిమాకు విషం కాకుండా అమృతమయ్యేలాగా దర్శకుడు పక్కా ప్రణాళికతో రెడీ అయినట్లు తెలుస్తోంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.