Begin typing your search above and press return to search.

ఆది సాయికుమార్ 'అతిథి దేవోభవ' ఫస్ట్ లుక్..

By:  Tupaki Desk   |   1 Sep 2021 6:30 AM GMT
ఆది సాయికుమార్ అతిథి దేవోభవ ఫస్ట్ లుక్..
X
డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయి కుమార్.. హీరోగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకోడానికి ట్రై చేస్తున్నాడు. ఫలితంతో సంబంధం లేకుండా వివిధ జోనర్లలో వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంగా ప్రతిభావంతులైన యువ దర్శకులకు అవకాశాలు ఇస్తున్నాడు. తాజాగా ఆది నటిస్తున్న సినిమాకు సంబంధించిన టైటిల్ మరియు ఫస్ట్ లుక్ పోస్టర్‌ ను ఆవిష్కరించారు.

శ్రీనివాస సినీ క్రియేషన్స్ బ్యానర్ లో రూపొందుతున్న ఈ చిత్రానికి ''అతిథి దేవోభవ'' అనే టైటిల్ ని ఖరారు చేశారు. ఈ సందర్భంగా రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ చాలా ఆసక్తికరంగా ఉంది. క్లాస్ వేషధారణలో ఉన్న ఆది ఓ అద్దం వైపు పరుగెత్తడం చూడవచ్చు. అద్దంలో హీరోయిన్ నువేష్కా ను ఆది హత్తుకొని కనిపిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్ ఈ ప్రాజెక్ట్ మీద మంచి ఇంప్రెషన్ కలిగిస్తోంది.

లవ్ అండ్ యాక్షన్ థ్రిల్లర్‌ గా రూపొందుతున్న ''అతిథి దేవోభవ'' చిత్రానికి పొలిమేర నాగేశ్వర్ దర్శకత్వం వహిస్తున్నారు. కె వేణు గోపాల్ రెడ్డి ఈ సినిమాకి కథ రాయగా.. రజనీ రాజబాబు స్క్రీన్ ప్లే - మాటలు అందించారు. రామ సత్యనారాయణ రెడ్డి సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని రాజబాబు మిర్యాల మరియు అశోక్ రెడ్డి మిర్యాల కలసి నిర్మిస్తున్నారు. శేఖర్ చంద్ర ఈ చిత్రానికి సంగీతం సమకూరుస్తుండగా.. అమరనాధ్ బొమ్మిరెడ్డి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. కార్తీక్ శ్రీనివాస్ ఎడిటింగ్ వర్క్ చేస్తున్నారు.

'అతిథి దేవోభవ' చిత్రంలో ఆది సాయి కుమార్ - నువేక్ష లతో పాటుగా రోహిణి - సప్తగిరి - సూర్య - ఆదర్శ్ - రవి ప్రకాష్ - రఘు కారుమంచు - మణిచందన - భెల్ ప్రసాద్ - గుండు సుదర్శన్ - ప్రియాంక - నవీనా రెడ్డి - సత్తిపండు - ఇమ్మాన్యుయేల్ తదితరులు నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రాన్ని త్వరలోనే విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.