Begin typing your search above and press return to search.

‘ఆది పురుష్’: ఆ స్టిల్ వదిలితే మాములుగా ఉండదు!

By:  Tupaki Desk   |   11 April 2021 9:34 AM GMT
‘ఆది పురుష్’: ఆ స్టిల్ వదిలితే మాములుగా ఉండదు!
X
ప్రభాస్ సినిమా లేటెస్ట్ అప్డేట్స్ కోసం, ఆయన తాజా సినిమాల్లో స్టిల్స్ కోసం ఫ్యాన్స్ ఎంతలా ఎదురుచూస్తూంటారో తెలిసిందే. అందుకోసం అప్పుడప్పుడూ సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తూంటారు. ఇవన్ని ప్రభాస్, ఆయన టీమ్ ఖచ్చితంగా గమనిస్తూనే ఉంటుంది. అందుకేనేమో ...శ్రీరామ నవమి రోజున ‘ఆదిపురుష్’ సినిమాకు సంభందించిన స్టిల్ వదలటానికి సిద్దపడుతోందిట.

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్, బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న పాన్ ఇండియా చిత్రం ‘ఆదిపురుష్’. రామాయణ ఇతిహాసం నేపథ్యంలో రూపొందిస్తున్న ఈ చిత్రం ప్రారంభం నుంచే ఓ రేంజిలో క్రేజ్ తెచ్చుకుంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్‌ రాముడిగా కనిపించనున్నాడు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ రావణాసురుడిగా కనిపిస్తున్నాడు. సీతగా కృతి సనన్‌ నటిస్తోన్న ఈ సినిమా కోసం ... దాదాపు రూ.500 కోట్ల బడ్జెట్‌తో పెడుతున్నారని అంచనా.ఈ చిత్రం వచ్చే ఏడాది ఆగస్టు 11న విడుదల కానుంది. ఈ సినిమా గురించి ఒక సూపర్ అప్ డేట్ ఏమిటంటే శ్రీరామనవమి స్పెషల్ గా ఈ సినిమాలో ప్రభాస్ ఫస్ట్ లుక్ ని విడుదల చెయ్యాలని దర్శక నిర్మాతలు ఫిక్స్ అయ్యారని. ఈ మేరకు ఇప్పటికే మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ ఫస్ట్ లుక్ ఎలా ఉండాలి అనేదానిపై సినిమాకు సంభందించిన ప్రమోషన్ టీమ్ తో రకరకాలుగా చర్చలు జరుపుతున్నారట.

ఫైనల్ గా ఓ నిర్ణయానికి వచ్చారట. శ్రీరామ నవమి రోజు వదలుతున్న ఫస్ట్ లుక్ కాబట్టి... రాముడి పట్టాభిషేకం జరిగే సందర్భంలో స్టిల్ ను రిలీజ్ చేద్దామనుకుంటున్నారు. అదే కనక జరిగితే ఎక్కడ చూసినా ఆ స్టిల్లే కనపడుతుంది. శ్రీరామ నవమి రోజు...మొత్తం ఆ పిక్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ సినిమా ఇండియన్ సినిమాలోనే వన్ ఆఫ్ ది బెస్ట్ విజువల్ ట్రీట్ గా ఉంటుంది అని మేకర్స్‌ ప్రకటించారు. ఓవైపు గ్రాఫిక్స్ సంబంధించి పనులు చేస్తూనే మరోవైపు రియల్ క్యారెక్టర్స్‌తో షూటింగ్ చేస్తున్నారు.

రాముడి పాత్ర కోసం ప్రభాస్‌ భారీ కసరత్తు చేసాడట. పాత్రకు తగ్గట్టుగా కొంచెం స్లిమ్‌ లుక్‌లో కనబడనున్నారు. టీ-సిరీస్ బ్యానర్‌పై భూషణ్ కుమార్, కిషన్ కుమార్, ప్రసాద్ సుతార్, రాజేష్ నాయర్, ఓం రౌత్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి షూట్ చేసి తమిళ, మలయాళ, కన్నడ భాషలలో కూడా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయనున్నారు.