Begin typing your search above and press return to search.

క్లిక్‌ క్లిక్ : బ్యూటీఫుల్ స్టార్‌ కపుల్‌ '100 డేస్‌' సెలబ్రేషన్‌

By:  Tupaki Desk   |   29 Aug 2022 6:19 AM GMT
క్లిక్‌ క్లిక్ : బ్యూటీఫుల్ స్టార్‌ కపుల్‌ 100 డేస్‌ సెలబ్రేషన్‌
X
సౌత్‌ స్టార్‌ కపుల్ ఆది పినిశెట్టి మరియు నిక్కి గర్లాని ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం లో తెల్సిందే. వీరి పెళ్లి ఫోటోలు మరియు వీడియోలు ఆ మధ్య బాగా సోషల్ మీడియాలో వైరల్‌ అయిన విషయం తెల్సిందే. ఇప్పుడు మరోసారి ఈ జంట సోషల్‌ మీడియాలో సందడి చేస్తున్నారు. ఆది మరియు నిక్కి ఫుల్‌ హ్యాపీ మూడ్‌ తో ప్రస్తుతం పారిస్ లో ఉన్నారు.

పెళ్లి అయ్యి వంద రోజులు అయిన సందర్భంగా ఈ బ్యూటీఫుల్‌ కపుల్ విహార యాత్రకు పారిస్ కు వెళ్లారు. అక్కడ ఈఫిల్ టవర్ వద్ద ఫోటోలకు ఫోజ్‌ ఇచ్చి ఆ ఫోటోలను షేర్ చేశారు.

పెళ్లి జరిగి వంద రోజులు అయిన సందర్బంగా సెలబ్రేట్‌ చేసుకుంటున్నట్లుగా ఆది మరియు నిక్కి గర్లాని సోషల్‌ మీడియా ద్వారా తమ యొక్క ఆనందంను అభిమానులతో పంచుకున్నారు.

సుదీర్ఘ కాలం ప్రేమించుకుని పెళ్లి చేసుకున్న ఈ జంట కోలీవుడ్‌ తో పాటు టాలీవుడ్‌ లో కూడా అందరి దృష్టిని ఆకర్షించారు. వీరిద్దరు తమిళంలో స్టార్స్ అయినా కూడా తెలుగు లో కూడా వరుస సినిమాలతో అలరిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా ఆది టాలీవుడ్ లో లీడింగ్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మరియు విలన్ గా సెటిల్‌ అయిన విషయం తెల్సిందే.

ఇటీవల ది వారియర్ సినిమాలో కీలకమైన విలన్‌ పాత్రలో నటించి మెప్పించిన విషయం తెల్సిందే. సరైనోడు తర్వాత వరుసగా ఆది తెలుగు సినిమాల్లో విలన్‌ పాత్రలను చేస్తున్న విషయం తెల్సిందే.

ముందు ముందు మరిన్ని స్టార్‌ హీరోల సినిమాల్లో కూడా ఆది కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆది ఒక వైపు తమిళ్‌ లో హీరోగా నటిస్తూ ఇక్కడ విలన్ పాత్రలు చేయడం గొప్ప విషయం.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.