Begin typing your search above and press return to search.

య‌ష్ న‌ట‌న గురించి అధీరాలో నిజాయితీ ఇదీ!

By:  Tupaki Desk   |   7 May 2022 2:30 AM GMT
య‌ష్ న‌ట‌న గురించి అధీరాలో నిజాయితీ ఇదీ!
X
KGF 2 జైత్ర‌యాత్ర గురించి అన్ని ప‌రిశ్ర‌మ‌ల్లో ఆస‌క్తిక‌ర చ‌ర్చ సాగుతోంది. అన్ స్టాప‌బుల్ క‌లెక్ష‌న్స్ తో ఈ చిత్రం ఇప్ప‌టికీ హిందీ బెల్ట్ లో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. బాంబే స‌హా నార్త్ బెల్టు లో థియేటర్ లలో అన్నిచోట్లా ఆధిపత్యం చెలాయిస్తోంది. ఎందుకంటే ప్రేక్షకులు మల్టీప్లెక్స్ లకు పోటెత్తారు. కానీ KGF ఫీవ‌ర్ ఫ్రాంఛైజీ మొదటి అధ్యాయం నుండి ప్రారంభమైందన్న‌ది అంద‌రికీ తెలుసు. KGF చాప్టర్ 1 లో యష్ ని సాలిడ్ పెర్ఫామ‌ర్ గా చూపించారు. ఊహించని విధంగా ఆ సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన వాటిలో ఒకటిగా నిలిచింది. కొన్ని అతిపెద్ద బాలీవుడ్ చిత్రాల బాక్సాఫీస్ రికార్డుల‌ను సైతం అధిగమించింది. ప్రీక్వెల్ భారీ విజయం తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ చాప్టర్ 2 కోసం సంజయ్ దత్ -రవీనా టాండన్ వంటి బాలీవుడ్ బ‌డా స్టార్లను బ‌రిలోకి దించారు.

బాక్స్ ఆఫీస్ వద్ద KGF 2 గర్జన కొన‌సాగుతున్న క్ర‌మంలోనే బోలెడంత చ‌ర్చ సాగింది. అధీరా పాత్ర‌ధారి సంజయ్ దత్ మూవీపై అంచనాలు భయాలు అనుభవాలు ఇత‌ర‌ జ్ఞాపకాల గురించి మాట్లాడారు. . చిట్-చాట్ సెషన్ లో సంజయ్ దత్‌ని KGF 1 గురించి బాగా ఆకట్టుకున్న విష‌యం ఏదీ? అని ప్ర‌శ్నిస్తే ఆస‌క్తిక‌ర స‌మాధాన‌మిచ్చారు. నిజాయితీగా సమాధానం ఇస్తూ,.. “నన్ను బాగా ఆకట్టుకున్నది ఏది? నటన, యష్ నిజంగా శ్రీనిధి! అన్నింటికంటే ప్రశాంత్ నీల్. ఆయన ప్రెజెంట్ చేసిన విధానం మనం కథను ప్రెజెంట్ చేసిన విధానం. భావోద్వేగాలు.. ప్రేమకథ.. యాక్షన్.. ఇది అద్భుతంగా ఉంది! ” అని అన్నారు.

KGF చాప్టర్ 2 ఏప్రిల్ లో విడుదలైంది. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఇప్పటి వరకు పోటీకి దిగిన సినిమాల ను మించి ఈ చిత్రం భారీ స్పందనను పొందుతోంది. ఎంతగా అంటే KGF 3 సెట్స్ కెళ్ల‌నుంద‌న్న టాక్ వైర‌ల్ అయ్యేంత‌గా చేసింది ఈ ట్రెండ్. KGF 2 లో కన్నడ సూపర్ స్టార్ యష్- శ్రీనిధి శెట్టి- సంజయ్ దత్- రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రం తమిళ నూతన సంవత్సరం సందర్భంగా ఏప్రిల్ 14న‌ విడుదలైంది. హిందీ- మలయాళం- తమిళం- కన్నడ- తెలుగుతో సహా ఐదు భాషల్లో విడుదలైంది.