Begin typing your search above and press return to search.

పంజా విల‌న్‌.. స్వీటీ హజ్బాండ్‌..

By:  Tupaki Desk   |   20 Sep 2015 5:03 AM GMT
పంజా విల‌న్‌.. స్వీటీ హజ్బాండ్‌..
X
క‌ర్మ సినిమాతో ద‌ర్శ‌కుడిగా - హీరోగా ప‌రిచ‌యం అయ్యాడు అడివి శేష్‌. ఆ త‌ర్వాత ఈ ఎన్నారై కెరీర్ ప‌రంగా వెనుదిరిగి చూసుకోవాల్సిన ప‌నే లేకుండా పోయింది. ఆ వెంట‌నే పంజా చిత్రంలో అవ‌కాశం ఇచ్చాడు ప‌వ‌న్‌. జానూ.. ఎంత అందంగా ఉన్నావే..? అంటూ విల‌నీ చూపించి ఆక‌ట్టుకున్న శేష్ ఆ త‌ర్వాత క్రేజీ ప్రాజెక్టుల్లో అతిధి పాత్ర‌ల్లో, కీల‌క‌పాత్ర‌ల్లో అవ‌కాశాలు అందుకున్నాడు.

ఇటీవ‌లే రిలీజై ఘ‌న‌విజ‌యం సాధించిన బాహుబ‌లి చిత్రంలో ఓ కీల‌క‌పాత్ర‌లో న‌టించాడు. రుద్ర‌మ‌దేవి 3డిలోనూ శేష్ న‌టించాడు. అలాగే అనుష్క క‌థానాయిక‌గా న‌టించిన సైజ్ జీరో సినిమాలోనూ స్వీటీ తో క‌లిసి న‌టించాడు. ఇప్పుడు మ‌రోసారి స్వీటీ న‌టిస్తున్న ఊపిరి చిత్రంలోనూ త‌న‌కి హ‌బ్బీగా న‌టిస్తున్నాడు. ఇది క‌థ‌ను కీల‌క‌మ‌లుపు తిప్పే క్యారెక్ట‌ర్ అని చెబుతున్నారు. ప్ర‌త్య‌క్షంగానో - పరోక్షంగానో స్వీటీ వెంటే క‌నిపిస్తున్నాడు శేష్‌. ఇంకా చెప్పాలంటే స్వీటీ ఏ సినిమాలో ఉంటుందో ఆ సినిమాలోకి దూరిపోతున్నాడు శేష్‌. బాహుబ‌లి - సైజ్ జీరో - రుద్ర‌మ‌దేవి .. ఇన్ని సినిమాల్లో స్వీటీతో క‌లిసి న‌టించాడు.

తాజాగా స్వీటీ అనుష్క కు పెయిర్‌ గా ఊపిరి చిత్రంలో న‌టించ‌డం టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది. ఈ చిత్రంలో నాగార్జున క్వాడ్రి ప్లెజిక్ అనే అరుదైన వ్యాధితో బాధ‌ప‌డేవాడిగా న‌టిస్తున్నాడు. ఫ్రెంచి సినిమా ఇన్ ట‌చ‌బుల్స్ ఆధారంగా ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.