Begin typing your search above and press return to search.

ఆర్టికల్‌ 15 రీమేక్‌ కు గూఢచారి కన్ఫర్మ్‌

By:  Tupaki Desk   |   10 Aug 2020 10:30 AM IST
ఆర్టికల్‌ 15 రీమేక్‌ కు గూఢచారి కన్ఫర్మ్‌
X
బాలీవుడ్‌ మూవీ ఆర్టికల్‌ 15 ను తెలుగు మరియు తమిళంలో ఏక కాలంలో రీమేక్‌ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ ఈ సినిమా రీమేక్‌ రైట్స్‌ ను దక్కించుకున్నాడు. తమిళంలో ధనుష్‌ దాదాపుగా కన్ఫర్మ్‌ అయ్యాడు. తెలుగులో రీమేక్‌ కోసం పలువురు యంగ్‌ హీరోలను సంప్రదించి చివరకు అడవి శేషును ఓకే చేసినట్లుగా తెలుస్తోంది. విభిన్న చిత్రాలతో నటుడిగా తనకంటూ ఒక మంచి పేరును దక్కించుకున్న అడవి శేషు ఈ సినిమాకు తప్పకుండా న్యాయం చేస్తాడనే నమ్మకంతో మేకర్స్‌ ఉన్నారు.

గూఢచారి చిత్రంతో అడవి శేషు సక్సెస్‌ దక్కించుకోవడంతో పాటు విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్నాడు. కనుక ఆర్టికల్‌ 15 కు ఈయనే బెస్ట్‌ ఛాయిస్‌ అంటూ పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అడవి శేషు మేజర్‌ సందీప్‌ ఉన్నికృష్ణన్‌ జీవిత చరిత్ర ఆధారంగా రూపొందుతున్న ఒక చిత్రంను చేస్తున్నాడు. ఆ సినిమా పూర్తి అయిన తర్వాత ఆర్టికల్‌ 15 సినిమా మొదలయ్యే అవకాశం ఉంది. త్వరలోనే ఈ రీమేక్‌ కు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.