Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: త్రివిక్రమ్ తారక సమేత బాలకృష్ణ!

By:  Tupaki Desk   |   6 Aug 2018 4:53 AM GMT
ఫోటో స్టొరీ: త్రివిక్రమ్ తారక సమేత బాలకృష్ణ!
X

త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కుతున్న 'అరవింద సమేత వీర రాఘవ' దసరా సీజన్లో రిలీజ్ కానున్న క్రేజీ ప్రాజెక్టులలో ఒకటి. ఇప్పటికే ఫస్ట్ లుక్ పోస్టర్ లతో - లీక్ డ్ స్టిల్స్ తో ప్రేక్షకుల్లో ఎంతో ఆసక్తిని రేకెత్తించిన ఈ సినిమాకు సంబంధించిన ఏ అప్ డేట్ వచ్చినా అది క్షణాల్లో వైరల్ అవుతోంది.

ఈ సినిమాలో ఓ పాత్రలో నటిస్తున్న నటుడు ఆదర్శ్ బాలకృష్ణ ఆదివారం నాడు ఓ స్పెషల్ ఫోటో పోస్ట్ చేశాడు. ఆదర్శ్ కు ఒకవైపు త్రివిక్రమ్ - మరోవైపు ఎన్టీఆర్ నిలబడి ఉన్న ఫొటో ను తన ఫేస్ బుక్ ఖాతా ద్వారా పోస్ట్ చేసి "ఇదొక ఎక్స్ ట్రా స్పెషల్ సండే లా మారిపోయింది. నాదో చిన్న క్యామియో అయినా గానీ ఎన్టీఆర్ గారు - త్రివిక్రమ్ సర్ తో వర్క్ చేయడం అంటే కల నిజమైనట్టే"నని తెలిపాడు.

ఎన్నో టాలీవుడ్ సినిమాల్లో నటించిన ఆదర్శ్ బిగ్ బాస్ ఫస్ట్ సీజన్ లో నటించడం ద్వారా పాపులారిటీ సాధించిన విషయం తెలిసిందే. మరి ఆ సీజన్ కు యంగ్ టైగర్ హోస్ట్ గా వ్యవహరించాడు కదా.. సో తారక్ అన్నతో కనెక్షన్ సెట్ అయినట్టుంది. కారణం ఏదైనా తారక్ - త్రివిక్రమ్ లతో కలిసి ఫోటో దిగడం అప్కమింగ్ యాక్టర్లకు ఎవరికైనా ఓ మెమోరీనే!