Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: అదా నేచుర‌ల్ అందానికి ఫిదా

By:  Tupaki Desk   |   1 April 2021 9:38 AM GMT
ఫోటో స్టోరి: అదా నేచుర‌ల్ అందానికి ఫిదా
X
అదా శ‌ర్మ నిరంత‌ర ఇన్ స్టా ట్రీట్ గురించి తెలిసిందే. `హార్ట్ ఎటాక్` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఈ బ్యూటీ స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి,.. సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌.. గ‌రం.. క్ష‌ణం.. క‌ల్కీ వంటి చిత్రాల్లో న‌టించింది. కానీ ఆశించిన స్టార్ డ‌మ్ అందుకోవ‌డంలో త‌డ‌బ‌డింది.

`క్వ‌శ్చ‌న్ మార్క్‌` అనే చిత్రంలో న‌టిస్తోంద‌ని ప్ర‌చార‌మైనా దానికి సంబంధించి స‌రైన అప్ డేట్ లేదు. ఇటీవ‌ల చేతిలో సినిమాలేవీ లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో వ‌రుస ఫొటోషూట్ల‌తో వేడెక్కిస్తోంది. ఈ ఫోటోలు వీడియోల‌తోనే ఇన్ స్టా.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ భామ‌కు అసాధార‌ణ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈ మాధ్య‌మాల్లో నిరంత‌రం వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని షేర్ చేస్తూ క్లిక్ లు లైక్ ల‌తో బాగానే ఆర్జిస్తోంది. అదాకి అదా పేరుతో ట్విట్ట‌ర్ లోనూ ట్రెండింగ్ వీడియోల‌తో వేడి పెంచుతోంది. ‌

తాజాగా అదా షేర్ చేసిన హాట్ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోలో అదా అందాల ఎలివేష‌న్ సంథింగ్ స్పెష‌ల్ అనే చెప్పాలి. అదా అంత‌గా మేక‌ప్ లేకుండా డీగ్లామ‌ర‌స్ గా క‌నిపిస్తున్న ఈ ఫోటో హైలైట్ అవ్వ‌డంతో అభిమానులు అంతే వేగంగా వైర‌ల్ చేస్తున్నారు.