Begin typing your search above and press return to search.

ఆ మాత్రం దానికే భయపడాలా..

By:  Tupaki Desk   |   26 Sept 2016 4:00 AM IST
ఆ మాత్రం దానికే భయపడాలా..
X
ఆదాశర్మకు కెరీర్ లో వరుసగా హిట్స్ ఉన్నాయి. భారీ సక్సెస్ లు సాధించిన సినిమాలు కూడా ఈమె అకౌంట్ లో ఉన్నా.. ఆఫర్స్ దక్కించుకోవడం విషయంలో ఇంకా కాస్త వెనకబడే ఉంది. అయితే.. ఈమె ప్రదర్శించే యాక్టింగ్ ట్యాలెంట్ కంటే.. చూపించే ఫ్యాషన్ ట్రెండ్ కే ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటంది.

'ఫ్యాషన్ అంటే అదేమీ భయపడే విషయం కాదు. తప్పులు చేసినా క్రేజీగా వాటిని హ్యాండిల్ చేస్తే సరిపోతుంది. నేను ఇండియన్ ఫ్యాషన్ ట్రెండ్ ని క్రియేషన్స్-కంటిన్యూ చేయగానికి.. చాలా సంతోషిస్తా. అది షూస్ అయినా.. హెయిర్ స్టైల్ అయినా.. నాకు నచ్చిన పద్థతిలోనే నేనుంటా. నచ్చినవి వేసుకోవడంలో అస్సలు భయపడను. అప్పుడే నాకు హ్యాపీ' అంటూ చెప్పుకొచ్చింది ఆదా. పూణేలో జరిగిన ఫ్యాన్ వీక్ లో తొలి రోజున ఆదా సందడి చేయగా.. డిజైనర్ సంగీతా శర్మ రూపొదించిన లెహంగాను ధరించి ర్యాంప్ వాక్ చేసింది ఆధా శర్మ.

తాను ఇండియన్ వేర్ లోనే అందంగా కనిపిస్తానంటున్న ఆదా.. అందుకే ఈ కలెక్షన్ తకు సరిగ్గా సరిపోయాయని చిలకపలుకులు పలికేస్తోంది. ప్రస్తుతం కమాండో2 చిత్రంలో నటిస్తున్న ఆదా.. ఈ చిత్రం తన రోల్ గురించి చాలానే చెప్పేస్తోంది. తన కెరీర్ లోనే ఇధి అత్యంత కష్టమైన పాత్ర అని ఆదా శర్మ చెప్పడం విశేషం.