Begin typing your search above and press return to search.

క్యాస్టింగ్ కోచ్: మనకు ఛాయిస్ ఉంటుందంటున్న అదా

By:  Tupaki Desk   |   9 May 2020 7:00 AM IST
క్యాస్టింగ్ కోచ్: మనకు ఛాయిస్ ఉంటుందంటున్న అదా
X
#మీటూ ఉద్యమం.. క్యాస్టింగ్ కోచ్ అనేది ఓ సున్నితమైన అంశం. అత్యంత సున్నితమైన అంశమని చెప్పాలి. ఎందుకంటే అధిక శాతం సందర్భాలలో బాధితులు బయటకు వచ్చి చెప్పుకోరు. ఒకవేళ బయటకు వచ్చి చెప్పినవారిని ప్రూఫ్స్ లేకుండా నమ్మేదెలా? ఆరోపణలలో నిజమే ఉండొచ్చు కానీ రుజువులు లేకుండా నమ్ముతూ పోతే రేపు ఎవరిపైన ఆరోపణలు చేసినా నమ్మాల్సి వస్తుంది. అందుకే కోర్టులో ఇలాంటి ఆరోపణలు నిలబడవు. పక్కాగా ఆధారాలు ఉంటే తప్ప చట్టప్రకారం చర్యలు తీసుకోవడం వీలు కాదు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు క్యాస్టింగ్ కోచ్ పై తమ అభిప్రాయాలు తెలిపారు. తాజాగా అదా శర్మ విషయంపై మాట్లాడింది.

దక్షిణాది.. ఉత్తరాది మాత్రమే అని కాదు.. ప్రపంచమంతా క్యాస్టింగ్ కోచ్ ఉందని అదా కుండబద్దలు కొట్టింది. "ప్రపంచమంతా కోచ్ లు (సోఫాలు) తయారు చేస్తారని.. అయితే ఆ సోఫాపై కూర్చోవాలా పడుకోవాలా.. నిలబడాలా.. అసలు దానిపై ఏం చెయ్యకుండా ఉండాలా అనే ఛాయిస్ మనకు ఉంటుంది. మీరు నేల మీద కూడా కూర్చోవచ్చు" అంటూ కొంచెం సెటైర్ ధ్వనించే టోన్ తో చెప్పింది. అదా మాటల్లో కొంత వెటకారం ఉన్నప్పటికీ అందులో వాస్తవమే ఉంది. తాత్కాలికంగా ఏదో లాభం వస్తుందని ఎవరో కోరిన కోరికను ఎందుకు మన్నించాలి? తర్వాత ఎందుకు హంగామా చెయ్యాలి. సినిమా ఆఫర్ పోయినా సరే.. గట్టిగా ముందే నో చెప్పాలి. పింక్ లో చెప్పినట్టు.. నో మీన్స్ నో.

ఇక అదా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే 'మ్యాన్ టు మ్యాన్' అనే చిత్రంలో నటిస్తోంది. ఈ సినిమాలు యువతిగా లింగమార్పింది చేయించుకున్న ఓ యువకుడి పాత్రలో నటిస్తోంది. ఈ సినిమాతో అదా సంచలనం సృష్టించడం ఖాయమనే అంచనాలు ఉన్నాయి.