Begin typing your search above and press return to search.

ఈ అస‌నం చూశాక అదాకి ఫిదా అంటారు

By:  Tupaki Desk   |   7 April 2021 9:00 AM IST
ఈ అస‌నం చూశాక అదాకి ఫిదా అంటారు
X
సోష‌ల్ మీడియాల్లో ఫిట్నెస్ ఫ్రీక్స్ విన్యాసాల గురించి ఎంత చెప్పినా త‌క్కువే. ఓవైపు మ‌లైకా అరోరాఖాన్.. క‌రీనా క‌పూర్ ఖాన్.. శిల్పాశెట్టి.. దిశా ప‌టానీ లాంటి భామ‌లు ఉచితంగా యోగా క్లాసులు చెబుతున్నారు. మ‌రోవైపు యువ‌క‌థానాయిక‌లు యోగా జిమ్ ఫీట్స్ ని ఇన్ స్టాలో షేర్ చేస్తూ వాటివ‌ల్ల ప్ర‌యోజ‌నాల్ని వివ‌రిస్తున్నారు.

ఇటీవ‌ల అదాశ‌ర్మ ఈ కేట‌గిరీలో చేరిపోతోంది. ఈ బ్యూటీ నిరంత‌రం ఇన్ స్టా ట్విట్ట‌ర్ వేదిక‌గా అదిరిపోయే ఫోటోలు వీడియోల్ని షేర్ చేస్తోంది. అవ‌న్నీ వైర‌ల్ గా మారుతున్నాయి. తాజాగా ఓ స్పెషల్ యోగాస‌నాన్ని ప‌రిచ‌యం చేసింది. ఇది శీర్షాస‌నానికి భిన్న‌మైన‌ది.

నేల‌పై చేతులు ఆన్చి ఇరువైపులా గోడ‌ల్ని ఆస‌రాగా చేసుకుని అదాశ‌ర్మ విన్యాసాలు చూస్తుంటే ఔరా అనిపిస్తున్నాయి. ఈ అస‌నాన్ని అభిమానులు అదాస‌నం అని పిలిచేసుకోవ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది. అదాశ‌ర్మ క‌నిపెట్టిన అస‌నం అదాస‌నం అన్న‌మాట‌. ఏదేమైనా ఇలాంటి ఒక రిక‌గ్నిష‌న్ క‌చ్ఛితంగా నేటిత‌రం అవ‌స‌రం అని నిరూపిస్తోంది అదా. త‌న కంటూ ఒక ప్ర‌త్యేక‌మైన దారి ఉంద‌ని నిరూపిస్తోంది. సోషల్ మీడియాల్లో అవిరామంగా కృషి చేసేవారికి అవార్డులిస్తే క‌చ్ఛితంగా అదాకి ఓ అవార్డు ఉంటుందని అభిమానులు త‌న స్పీడ్ పై కౌంట‌ర్లు వేస్తున్నారు.

అదాశ‌ర్మకు ఇటీవ‌ల సినిమా ఆఫర్లు లేవు. `క్వ‌శ్చ‌న్ మార్క్‌` అనే చిత్రంలో న‌టిస్తోంద‌ని ప్ర‌చార‌మైనా దానికి సంబంధించి స‌రైన అప్ డేట్ లేదు. అలాగే ఖాళీ స‌మ‌యాన్ని సోష‌ల్ మీడియాల‌కు కేటాయించి వ‌రుస‌ ఫోటోషూట్లతో ఫాలోవ‌ర్స్ ని పెంచుకోవ‌డంలో స‌ఫ‌లమైంది. త‌ద్వారా వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల‌తో బాగానే ఆర్జిస్తోంది.