Begin typing your search above and press return to search.

మ‌ద‌ర్స్ డే గిఫ్ట్: అదాశ‌ర్మ క్రియేటివిటీ సో క్యూట్

By:  Tupaki Desk   |   8 May 2021 5:30 AM GMT
మ‌ద‌ర్స్ డే గిఫ్ట్: అదాశ‌ర్మ క్రియేటివిటీ సో క్యూట్
X
`హార్ట్ ఎటాక్` చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెట్టిన ఉత్త‌రాది బ్యూటీ అదాశ‌ర్మ‌. స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి... సుబ్ర‌హ్మ‌ణ్యం ఫ‌ర్ సేల్‌.. గ‌రం.. క్ష‌ణం.. క‌ల్కి వంటి చిత్రాల్లో న‌టించింది. క్యూట్ లుక్స్ తో గ్లామ‌ర‌స్ డాళ్ పాత్ర‌ల‌తో మెప్పించింది. కానీ ఇక్క‌డ ఆశించినంత పెద్ద స్టార్ డ‌మ్ చిక్క‌లేదు.

అటు బాలీవుడ్ లో అడ‌పాద‌డ‌పా సినిమాలు వెబ్ సిరీస్ ల‌లో న‌టిస్తోంది. ఇటీవ‌ల చేతిలో సినిమాలేవీ లేక‌పోవ‌డంతో సోష‌ల్ మీడియాలో వ‌రుస ఫొటోషూట్ల‌తో వేడెక్కిస్తోంది. ఈ ఫోటోలు వీడియోల‌తోనే ఇన్ స్టా.. ట్విట్ట‌ర్ వేదిక‌గా ఈ భామ‌కు అసాధార‌ణ ఫాలోయింగ్ పెరిగింది. ఇక ఈ మాధ్య‌మాల్లో నిరంత‌రం వాణిజ్య ప్ర‌క‌ట‌న‌ల్ని షేర్ చేస్తూ బాగానే ఆర్జిస్తోంది. అదాకి అదా ట్విట్ట‌ర్ వేదిక గురించి సుప‌రిచిత‌మే.

నేడు మ‌ద‌ర్స్ డే సంద‌ర్భంగా అదా షేర్ చేసిన ఓ వీడియో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ వీడియోలో అదా క్రియేటివిటీ ఆక‌ట్టుకుంటోంది. త‌న త‌ల్లితో క‌లిసి అథ్లెటిక్ విన్యాసాల‌తో అదా మైమ‌రిపించింది. ప్ర‌స్తుతం ఈ వీడియో అభిమానుల్లో వైర‌ల్ గా మారింది.