Begin typing your search above and press return to search.

గరం గరం ఆదాతో ఆ కుర్రాడు

By:  Tupaki Desk   |   14 Nov 2015 5:00 PM IST
గరం గరం ఆదాతో ఆ కుర్రాడు
X
కెరీర్ మొదట్లో పర్వాలేదనిపించినా.. ఆ తర్వాత సుకుమారుడు, ప్యార్ మే పడిపోయా, గాలి పటం, రఫ్ లాంటి ఫ్లాపులతో కింద పడ్డాడు సాయికుమార్ తనయుడు ఆది. ఐతే తన సినిమాల ఫలితాలెలా ఉన్నా.. కుర్రాడికి ఛాన్సులు మాత్రం బాగానే వస్తున్నాయి. టాలెంటెడ్ రైటర్ కం డైరెక్టర్ మదన్ దర్శకత్వంలో ఆది హీరోగా ‘గరం’ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. సురేఖ అనే కొత్త నిర్మాత ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ సినిమా పోస్టర్లు ఈ రోజే విడుదలయ్యాయి. ఈ పోస్టర్లో ఆది ఎనర్జిటిక్ గా కనిపిస్తుంటే.. ఆదా టైటిల్ కు తగ్గట్లు గరం గరంగా కనిపిస్తోంది.

ఆదా ఇప్పటిదాకా చేసిన సినిమాల్లో కొంచెం పద్ధతిగానే కనిపించింది. కానీ తన కెరీర్ కు చాలా కీలకమైన సినిమా కావడంతో గ్లామర్ విషయంలో ఏం తగ్గలేదని పోస్టర్లు చూస్తే అర్థమవుతోంది. కొంచెం ఒళ్లు చేసిన ఆదా.. రెచ్చగొట్టే అందాలతో కుర్రాళ్లకు వల విసురుతోంది. తొలి సినిమా ‘హార్ట్ అటాక్’ హిట్టయినా ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు తనకంత మంచి పేరు తేలేదు. హీరో హీరోయిన్లతో పాటు దర్శకుడికి కూడా ఇది చాలా కీలకమైన సినిమా. పెళ్లయిన కొత్తలో.. తర్వాత మదన్ తీసిన సినిమాలు ఆడలేదు. దీంతో బాగా గ్యాప్ తీసుకుని తన స్టయిల్ కు భిన్నంగా మాస్ సినిమా తీశాడు మదన్. మరి ఎలాంటి ఫలితం వస్తుందో చూడాలి.