Begin typing your search above and press return to search.

అక్కడ ఆయన హార్ట్ ఎటాక్ తెప్పిస్తుందా?

By:  Tupaki Desk   |   6 April 2018 6:09 AM GMT
అక్కడ ఆయన హార్ట్ ఎటాక్ తెప్పిస్తుందా?
X
ముంబై బ్యూటీ ఆదా శర్మకు టాలీవుడ్ లో అడుగు పెట్టి ఐదేళ్లు గడిచిపోతోంది. 2008లో హిందీ సినిమాలతో మొదలుపెట్టిన ఆదా.. 2014లో పూరీ జగన్నాధ్ రూపొందించిన హార్ట్ ఎటాక్ తో టాలీవుడ్ అరంగేట్రం చేసింది. పూరీ హీరోయిన్ గా క్రేజ్ బాగానే వచ్చింది కానీ.. అందుకు తగ్గ సినిమాలు ఎంచుకోవడంలో చేసిన పొరపాట్ల కారణంగా.. ఇక్కడ నెక్ట్స్ లెవెల్ కు వెళ్లలేకపోయింది.

మధ్యలో కన్నడలో కూడా ఓ ప్రయత్నం చేసిన ఆదా శర్మ.. చివరగా తెలుగులో క్షణం మూవీలో యాక్ట్ చేసింది. ఇప్పుడీ చిన్నది తమిళంలో తన అదృష్టానికి బయలుదేరింది. చార్లీ చాప్లిన్2 అంటూ ప్రభుదేవా లీడ్ రోల్ లో నటించిన మూవీతో కోలీవుడ్ లో అడుగు పెడుతోంది ఆదా. ప్రభు దేవా బర్త్ డే సందర్భంగా స్పెషల్ గా ట్వీట్ చేసిన ఈ బ్యూటీ 'మీ సినిమాతో తమిళ్ లోకి వస్తున్నందుకు ఫుల్లు హ్యాపీగా ఉంది' అని చెప్పింది. ఇన్ డైరెక్టుగా.. తనకు తమిళ్ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాల్సిన బాధ్యతను ప్రభుదేవాపై పెట్టేసింది.

ఇండియన్ మైకేల్ జాక్సన్ గా గుర్తింపు పొందిన ప్రభుదేవా.. చార్లీ చాప్లిన్2 అంటూ చేస్తున్న మూవీతో.. ఆదా శర్మకు హార్ట్ ఎటాక్ తెప్పిస్తాడా.. చిరకాలం గుర్తుండిపోయే క్షణాలను అందిస్తాడో చూడాలి. ఇంతకీ ఈ చార్లీ చాప్లిన్2 కు తొలి భాగం 2002లో వచ్చింది. తెలుగులో 'పెళ్లాం ఊరెళితే' అనే పేరుతో వచ్చిన పక్కా కామెడీ సినిమా గుర్తుంది కదా. దానికి సీక్వెల్ గానే ఈ చార్లీ చాప్లిన్2 సిద్ధమైంది. చార్లీ చాప్లిన్ చిత్రం మన దేశంలో మొత్తం 6 భాషల్లో రీమేక్ అయి.. భారీ రికార్డునే సృష్టించింది. ఇప్పుడీ సీక్వెల్ ఎలాంటి రికార్డులను నమోదు చేయనుందో?